ఎమ్మెల్యే పార్థసారథి ఎపిసోడ్ కొలిక్కిరాలేదు. మరోసారి సారథితో రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి భేటీ చర్చలు జరిపారు. 30 నిమిషాలు పాటు వారు చర్చించారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు అయోధ్య రామిరెడ్డి. కాగా.. నిన్న సీఎం జగన్తో ఎమ్మెల్యే పార్థసారథి సమావేశమైన విషయం తెలిసిందే. అయినా సారథిలో అసంతృప్తి తగ్గనట్లుగా కనిపిస్తోంది. అయితే.. వచ్చే ప్రభుత్వం కేబినెట్ బెర్త్ పై హామీ కోసం సారథి పట్టుబడుతున్నట్లు సమాచారం. సారథితో జరిపిన చర్చల సారాంశాన్ని అయోధ్య రామిరెడ్డి సీఎం జగన్ దృష్టికి తీసుకు వచ్చారు. కాగా.. సారథి టీడీపీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరగుతోంది. తాజా పరిణామాలతో సారథి పార్టీ మార్పు ఖాయమనే సంకేతాలు కనపడుతున్నాయి.
Read Also: TDP: ఆ నలుగురు ఎమ్మెల్యేలపై టీడీపీ అనర్హత పిటిషన్..
ఇదిలా ఉంటే.. సారథి ఎపిసోడ్ పై పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సారథి నిన్న సీఎం జగన్ ను కలిశామన్నారు. జిల్లాలో, పార్టీలో జరుగుతున్న విషయాలపై చర్చించామని తెలిపారు. అది తమ అంతర్గత విషయమని పేర్కొన్నారు. సీఎం జగన్ మా కుటుంబ పెద్ద.. సీఎం దగ్గరకు వెళ్తే టికెట్లు మారుస్తారని అనటం తప్పు అని అన్నారు. ఇది టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్న ప్రచారం అని దుయ్యబట్టారు. టికెట్ ఇవ్వని పరిస్థితి ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది అని పేర్కొన్నారు. 2024లో తాను పామర్రు నుంచి పోటీ చేయటం ఖాయమని ఎమ్మెల్యే కైలే అనిల్ ధీమా వ్యక్తం చేశారు. కాగా.. పార్థసారధి వైసీపీ నుంచి పోటీ చేస్తారా లేదా అనే అంశంపై అనిల్ క్లారిటీ ఇవ్వలేదు. జిల్లాలో సారథి సన్నిహితుడిగా అనిల్ ఉన్న సంగతి తెలిసిందే. నిన్న పార్టీ నేతలతో పాటు సారథి బుజ్జగింపుల్లో అనిల్ కీలకంగా వ్యవహరించారు.
Read Also: Guntur Kaaram: గుంటూరు కారం టీంకి గుడ్ న్యూస్ చెప్పిన టీ సర్కార్