TDP: టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ ఇవ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఇవాళ లేదా రేపు.. స్పీకర్ ను కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని టీడీపీ ఫిర్యాదు చేయనుంది. కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిపై టీడీపీ అనర్హత పిటిషన్ ఇవ్వనుంది. ఆ నలుగురిని అనర్హులుగా ప్రకటించాలని టీడీపీ స్పీకర్ ను కోరనుంది. అనర్హత పిటిషనుకు బలం చేకూర్చేలా ఆధారాలతో సహా ఫిర్యాదు చేయనుంది టీడీపీ.
Read Also: MLA Balakrishna: హిందూపురంలో పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మెకు బాలకృష్ణ మద్దతు..
ఇదిలా ఉంటే.. నిన్న వైసీపీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. కాగా.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దానికి కౌంటర్ గా పార్టీ మారిన నలుగురిపై పిటిషన్ ఇవ్వనుంది. దీంతో.. ఇప్పుడు ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.
Read Also: Jayadev: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో డైరెక్టర్ మృతి