Jangaon DMHO: ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది. లంచం ఇస్తేనే పనిచేస్తానంటూ భీష్మించిన జనగామ DMHO ప్రశాంత్ గురువారం దొరికిపోయారు. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా చిక్కాడు. ఈ పనిలో జనగామ DMHO ప్రశాంత్ తో పాటు.. జూనియర్ అసిస్టెంట్ అజార్ కూడా ఉన్నాడు.
Read Also: IND vs AFG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. జైస్వాల్, సంజూకు నో ఛాన్స్..
ఔట్ సోర్సింగ్లో ఫార్మసిస్టుగా పనిచేస్తున్న స్రవంతి అనే అమ్మాయి ఉద్యోగం కోసం DMHO, జూనియర్ అసిస్టెంట్ లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. అంత డబ్బులు ఇచ్చుకోలేనని చెప్పినా.. మూడు నెలలుగా తిరిగినా అధికారులు సహకరించకలేదు. దీంతో.. మొదట యాభై వేలు డబ్బులు ఇచ్చినట్లు చెప్పింది. అయినప్పటికీ డీఎంఅండ్ హెచ్ఓ తన జాబ్ ను రెన్యువల్ చేయకపోవడంతో బాధిత మహిళ ఏసీబీని ఆశ్రయించింది. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. బాధిత మహిళ వద్ద నుంచి జూనియర్ అసిస్టెంట్, డీఎంహెచ్ఓ ఇద్దరూ కలిసి రూ. 50 వేలు డబ్బులు తీసుకుంటుండగా వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.