ఖమ్మం జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఆ సమయంలో ఎవ్వరూ విద్యార్థులు లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. జిల్లా కేంద్రంలోనే ప్రధాన కార్యాలయం ఉంటుంది. ఆ కార్యాలయంలో నిరంతరం ఉద్యోగస్తులు పని చేస్తుండేవారు. అదే విధంగా.. పై సెక్షన్ లో సుమారు 100 మంది చదువుకునే యువకులు ఉండేవారు. ప్రధానంగా యువకులు, మహిళలు ఈ గదిలో ఉండి పత్రికలు చదివేవారు.
Read Also: Hair Fall Control : చలికాలంలో జుట్టు ఎక్కువగా ఊడిపోతుందా? ఈ టిప్స్ మీ కోసమే..
అయితే ఈ భవనం ఎప్పుడో శిథిలావస్తకు చేరుకుంది. కానీ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల.. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఒక్కసారిగా కూలిపోయింది. అయితే ఈరోజు శుక్రవారం కావడంతో సెలవు దినం. దీంతో ఈ సెలవు దినం రోజున ఎవరు రాలేదు. అయితే ఈరోజు సెలవు లేకపోతే ఎంత మంది చనిపోయే వారో.. నిర్లక్ష్యంకు ఎవరు బాధ్యత వహిస్తారని యువకులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. కూలిన భవనంలో ఒకరిద్దరూ ఉన్నారన్న అనుమానాలతో మొత్తం కూడా శిథిలాలను జాగ్రత్తగా తొలగిస్తున్నారు. మూడు జేసీబీలు, ట్రాక్టర్లు, ఫైర్ సిబ్బంది సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. జిల్లా కలెక్టర్ గౌతమ్, సీపీ సునీల్ దత్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం మంత్రి తుమ్మల నాగేశ్వరావు కూడా ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. నగరంలో శిథిలాల భవనాల్ని వెంటనే కూల్చివేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే శిథిలాల కింద ఎవ్వరూ లేరని స్పష్టం అవుతుందని జిల్లా కలెక్టర్ గౌతమ్ చెబుతున్నారు.
Read Also: HanuMan : భారీ ధరకు సేల్ అయిన హనుమాన్ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?