తమిళనాడు సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ టీవీకే (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికాసేపట్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో విజయ్ భేటీ కానున్నారు.
ఆదివారం కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో మైలురాయిని చేరుకున్నాడు. అతని అద్భుత ప్రదర్శనతో కొత్త రికార్డులు సృష్టించాడు.
కటక్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. 305 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. భారత్ ఇంకా 33 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని ఆరోపించారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క దర్శించుకున్నారు. అంతకుముందు జంపన్న వాగు స్నాన ఘట్టాలు పరిశీలించారు. మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాం అని.. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి సీతక్క తెలిపారు.
సికింద్రాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత కలకలం రేపుతోంది. జింఖానా గ్రౌండ్స్ వద్ద 10 కేజీల గంజాయిని ఎక్సైజ్ STF అధికారులు సీజ్ చేశారు. పది కిలోల గంజాయిని పట్టుకున్నారు. అరకు నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తుండగా పట్టుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్లిన కొడుకు ఇంటికి ఆలస్యంగా వచ్చాడని కన్న కొడుకుని కొట్టి చంపాడు ఓ తండ్రి.. ఈ ఘటన చౌటుప్పల్ రూరల్ ఆరేగూడెం గ్రామంలో జరిగింది. అయితే పాఠశాలలో ఓ అవార్డ్ ప్రోగ్రాంలో పాల్గొన్న కొడుకు.. అక్కడ ఆలస్యం అయింది. ఈ క్రమంలో ఇంటికి ఆలస్యంగా రావడంతో కొడుకు భానుని(14) తండ్రి సైదులు కొట్టి చంపాడు.
కులగణన సర్వేపై కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కులగణన సర్వే పాదర్శకంగా జరిగింది.. కేటీఆర్ ఎలాంటి ఆధారాలు లేకుండా బీసీ కులగణనను తప్పులు తడక అంటున్నారని దుయ్యబట్టారు. ఎంతో శాస్త్రీయంగా లక్షకు పైన సిబ్బందిని పెట్టి ఇళ్లిల్లు పరిశీలన చేసి గణన చేయడం జరిగిందని తెలిపారు.
ఖమ్మం నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో నగర మేయర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, గిడ్డంగుల సంస్థ చైర్మన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లాఠీ దెబ్బలకు భయపడకుండా కాంగ్రెస్ కోసం కార్యకర్తలు పనిచేశారు.. కార్యకర్తలు కూడా అధికారాన్ని అనుభవించాలని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట మీరు అనేక హామీలను ఇచ్చారని.. అందులో రూ.2 లక్షల రుణమాఫీ అంతంత మాత్రమే పూర్తి చేశారని పేర్కొన్నారు. రైతు భరోసా పెట్టుబడి సాయానికి కోతలు పెట్టారని ఆరోపించారు. సన్నవడ్లకు మీరు ఇస్తానన్న బోనస్ డబ్బులను బోగస్ అన్నట్లుగానే ఎగవేస్తున్నారని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు.