భారత జట్టు క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఇటీవల తన తండ్రితో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని మహాకుంభ మేళాకు వెళ్లారు. ఈ సందర్భంగా.. మయాంక్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ స్మరణీయ ప్రయాణాన్ని పంచుకున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు మహాకుంభ మేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్ చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా మయాంక్ కూడా కుంభమేళాలో పాల్గొని.. తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, ప్రత్యేకమైన భక్తిని చాటుకున్నాడు.
టీమిండియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ 2022 డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. పంత్ ఢిల్లీ నుంచి రూర్కీ తన ఇంటికి వెళ్తుండగా.. డెహ్రాడూన్ హైవేపై అతని కారు ప్రమాదానికి గురైంది. అయితే.. హైవేపై ప్రయాణిస్తున్న కొంతమంది వ్యక్తులు పంత్ ప్రాణాలను కాపాడారు. అయితే.. పంత్ ప్రాణాలను కాపాడిన వ్యక్తులలో రజత్ అనే యువకుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతను చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నాడు.
2022లో ఐపీఎల్‌లో కొత్తగా చేరిన గుజరాత్ టైటాన్స్ జట్టు.. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో మొదటి సీజన్‌లోనే టైటిల్ సాధించి అనూహ్య విజయం సాధించింది. ఈ జట్టు ఇప్పుడు కొత్త యజమానిగా టోరెంట్ గ్రూప్‌ను పొందనుంది. ఇది రాబోయే ఐపీఎల్ సీజన్ ముందు జరుగుతుందని సమాచారం.. 2022లో ఈ జట్టును CVC క్యాపిటల్ పార్టనర్స్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం.. అహ్మదాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ టోరెంట్ గ్రూప్ 67 శాతం వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంది.
2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. 8 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఐసిసి ఈవెంట్ కోసం భారత జట్టును ప్రకటించారు. అయితే, భారత జట్టులో చోటు దక్కించుకున్న స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయం ఇప్పటికీ భారత జట్టుకు ఆందోళన కలిగించే అంశంగా మిగిలిపోయింది.
ప్రస్తుత కాలంలో ముఖంపై మచ్చలు, మొటిమలు, మచ్చలు అనేవి చాలా సాధారణ సమస్యలు. దుమ్ము, కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి మరియు చెడు జీవనశైలి వల్ల ఏర్పడుతాయి. ఈ సమస్యల నుండి బయటపడటానికి ఎన్నో రకాలైన చికిత్సలు, సబ్బులు, పేస్ క్రీములు వాడుతుంటారు. కానీ ఈ సమస్యలకు మనం ఇంట్లోనే చెక్ పెట్టొచ్చు. ఆలమ్ అని పిలువబడే పటిక.. చర్మపు మచ్చలను తొలగించడంలో, ముఖాన్ని అందంగా చేయడంలో సహాయపడుతుంది.
ప్రస్తుతం భారత్-ఇంగ్లాండ్‌తో మూడు వన్డేలు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు గెలిచి ఆధిక్యంలో ఉన్న భారత్.. మూడో మ్యాచ్ కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.
భారతీయ మార్కెట్లో కొత్త కంపెనీల ఎలక్ట్రిక్ వాహనాలు విడుదల అవుతూనే ఉన్నాయి. ఈ వాహనాలకు సరసమైన ధరలు, అధిక సామర్థ్యం, పర్యావరణానికి అనుకూలత వంటి విశేషాలతో అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగం పెరుగుతున్న డిమాండ్‌తో వాటి తయారీ సంస్థలు ప్రతి రోజు కొత్త ఆవిష్కరణలను ప్రజలకు అందిస్తున్నాయి. ఈ క్రమంలో సింపుల్ ఎనర్జీ అనే భారతీయ స్టార్టప్ ఫిబ్రవరి 11న 1.5 జనరేషన్ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు టీమిండియాకు ఒక బ్యాడ్ న్యూస్. భారత జట్టుకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ షెల్డాన్ జాక్సన్ తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు.
భారతదేశంలో పాపులర్ అయిన SUVలతో పాటు, హ్యాచ్‌బ్యాక్ కార్లను కూడా కార్ల లవర్స్ ఇష్టపడుతున్నారు. అందులో మారుతి సెలెరియో ఒక టాప్ హ్యాచ్‌బ్యాక్ గానూ ఉండిపోయింది. సాధారణంగా కాస్త తక్కువ బడ్జెట్ వాహనంగా అందించబడే ఈ కారులో 2025లో మారుతి కంపెనీ కొన్ని ప్రధానమైన మార్పులను చేసింది.
న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ తన అత్యద్భుతమైన ఫార్మ్‌తో అద్భుతమైన ప్రదర్శనను కనబరచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతను 113 బంతులలో 133 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో కేన్ 13 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో తన ప్రతిభతో కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ జట్టును గెలిపించడమే కాకుండా.. అతని 7,000 వన్డే పరుగుల మైలురాయిని మరింత వేగంగా చేరాడు. విలియమ్సన్ తన 159వ వన్డే ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను సాధించాడు. కాగా విరాట్ కోహ్లీ ఈ ఘనతను 161 ఇన్నింగ్స్‌లలో…