ఢిల్లీలో బీజేపీ విజయంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు, ఆప్‌కు ఢిల్లీ ప్రజలు పట్టం కడుతూ వచ్చారు.. 27 ఏళ్ల తర్వాత బీజేపీని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారని తెలిపారు. మోడీ సుపరిపాలనకు ప్రజలు ఆశీస్సులు అందించారు.. ఢిల్లీకి పట్టిన కేజ్రీవాల్ గ్రహణం.. దేశ రాజధానికి పట్టిన పీడ విరగడైందని ఆరోపించారు.
శనివారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆమె నివాసంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ అంశాల్లో రావలసిన ఆర్థిక వనరులకు సంబంధించి విజ్ఞప్తి చేశారు. గతంలో ఈ అంశాలకు సంబంధించి రాసిన లేఖలను సైతం ఆమెకు అందజేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని.. ఈ ఎన్నికలలో స్పష్టం అవుతోందని ఆయన అన్నారు. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతోందని ఆరోపించారు.
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో నాలుగు అంతర్జాతీయ విమానాలు ల్యాండింగ్ అయ్యాయి. అందుకు కారణం.. వాతావరణం అనుకూలించకపోవడం. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణం అనుకూలించకపోవడం కారణంగా అక్కడికి వెళ్లే విమానాలను శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు దారి మళ్లించారు అధికారులు.
వివో (Vivo) ఎట్టకేలకు భారతదేశంలో తన కొత్త స్మార్ట్‌ఫోన్ వివో V50 యొక్క లాంచ్ తేదీని ప్రకటించింది. ఈ ఫోన్ 2025 ఫిబ్రవరి 18న భారతదేశంలో లాంచ్ అవుతుంది. ప్రస్తుతం వివో V50 Pro గురించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం పంచుకోలేదు. ఇది వివో V40 యొక్క అప్‌గ్రేడ్ వేరియంట్‌గా లాంచ్ అవుతుంది.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతను క్రికెట్‌లో సాధించిన విజయాలు ఎన్నో.. ఆయనను చూడటానికి అభిమానులు ఎక్కడికైనా సరే వెళ్తారు. ధోని క్రికెట్ ఆడుతున్నాడంటే ఏ స్టేడియానికైనా వెళ్లే పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఆయనకు రాంచీలో అద్భుతమైన ఫామ్‌హౌస్.. హర్ములోని ధోని బంగ్లా ఉంది. దానిని చూస్తే మతిపోవాల్సిందే.. అది ఇప్పుడు సెల్ఫీ స్పాట్‌గా మారింది.
భారతీయ రైల్వే రైలు టిక్కెట్లను రెండు విధాలుగా బుక్ చేసుకోవచ్చు.. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పద్ధతిలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ టిక్కెట్ల కోసం సాధారణంగా రైల్వే స్టేషన్‌లోని కౌంటర్‌కు వెళ్లాలి. కౌంటర్ టిక్కెట్ల ధరలు.. ఆన్‌లైన్ టిక్కెట్ల కంటే తక్కువ ఉంటాయి. అయితే, ఈ ధర వ్యత్యాసం ఎందుకు జరుగుతుందో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా రాజ్యసభలో వివరణ ఇచ్చారు.
జీవితంలో మంచి, చెడు రకాల మనుషులు ఉంటారు. మనకు మంచి చేసే వారు కొందరైతే.. చెడు చేసే వారు ఎంతో మంది. అయితే.. ఎక్కువగా మనుషులు కూడా మంచి వాళ్లను నమ్మరు.. చెడు వాళ్లను కానీ, వాళ్ల మాటలనే నమ్ముతారు. దీంతో.. వారు మనకు తెలియకుండానే మనల్ని చాలా మోసం చేస్తారు. అందుకోసమని.. తియ్యగా మాట్లాడే వాళ్లను నమ్మొద్దని సూచిస్తారు.