తమిళనాడు సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ టీవీకే (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికాసేపట్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో విజయ్ భేటీ కానున్నారు. రానున్న ఎన్నికల్లో కలిసి పని చేయడానికి ఇరువురి మధ్య ఒప్పందం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో తమిళనాడు మొత్తం పాదయాత్ర లేదా బస్సు యాత్ర చేయడానికి ప్రశాంత్ కిషోర్ విజయ్‌ని సిద్ధం చేస్తున్నారు.
Read Also: Ranveer Allahbadia: ‘‘తల్లిదండ్రులు అది చేస్తుంటే చూస్తావా.?’’ యూట్యూబర్ అరెస్టుకి రంగం సిద్ధం..
కాగా.. తమిళ్ స్టార్ హీరో విజయ్ తమిళగ వెట్రి కళగం అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. గత ఫిబ్రవరి 2024 దళపతి విజయ్ తన తమిళనాడు వెట్రి కజగం పార్టీ గురించి అధికారిక ప్రకటన చేశాడు. పార్టీ స్థాపించిన తర్వాత విజయ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకోసమని.. ఇతర నాయకుల సలహాలను తీసుకుంటున్నారు విజయ్.. ఈ క్రమంలోనే పార్టీ బలోపేతంపై చర్చించేందుకు ప్రశాంత్ కిషోర్‌తో భేటీ కానున్నారు.