చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A సుప్రీం కోర్టు భిన్నాభిప్రాయాలు పై సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు పై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A వర్తిస్తాదా, వర్తించదా అనే అంశంపై ఈరోజు తీర్పు రావాల్సి ఉన్నా.. సుప్రీం కోర్టులోనే త్రిసభ్య న్యాయమూర్తులలో భిన్నభిప్రాయాలు వెలువడిందని, ముమ్మాటికి ఇందులో రాజకీయ జోక్యం చోటుచేసుకుందని వ్యాఖ్యలు చేశారు.
Read Also: YS Sharmila: ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా నన్ను విశ్వసించినందుకు కృతజ్ఞతలు..
బీజేపీకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్లపై కేసులు ఉండవని.. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఆ పార్టీ నాయకులు మీద ఎప్పుడు గానీ కత్తులు వేలాడుతూనే ఉంటుందని ఆరోపించారు. ఆ తరహాలోనే ఈ కేసులో కూడా 17A వర్తిస్తదా, వర్తించదా అనే అంశం వేలాడుతూనే ఉంటుందే తప్ప ఒక కొలిక్కి వచ్చేదానికి అవకాశం లేదని తెలిపారు. ఇందులో న్యాయ వ్యవస్థ కూడా ఒక రకమైన గేమ్ ను ఆడుతుందని తాను అభిప్రాయపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇది ఒక రకమైన రాజకీయ బెదిరింపు, ఒత్తిడి తప్ప మరొకటి లేదని ఆరోపించారు.
Read Also: Virat Kohli: విరాట్ కోహ్లీ దంపతులకు రామ మందిర ఆహ్వానం.. ఫోటోలు వైరల్..