రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా కొచ్చిలో ‘శక్తి కేంద్ర ఇన్‌చార్జ్ సమ్మేళనం’లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. అనంతరం.. కేరళలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్‌డీఎఫ్), యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో వేగవంతమైన అభివృద్ధిని నిరూపితమైన ట్రాక్ రికార్డ్, భవిష్యత్తు కోసం స్పష్టమైన విజన్ కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
3 టీ20 సిరీస్ లో భాగంగా భారత్-అఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగుతుంది. అటు అఫ్ఘనిస్తాన్ జట్టులో కూడా మూడు మార్పులు చేశారు. మూడో టీ20లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ జితేష్ శర్మ, పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆడటం లేదు. వికెట్ కీపర్ సంజూ శాంసన్, ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్,…
కోతులు చేసే వింత చేష్టలు ఒక్కోసారి నవ్వు తెప్పిస్తే.. ఒక్కోసారి చిరాకు తెప్పిస్తాయి. అయితే ఇప్పుడు.. ఓ కోతి చేసిన వింత చేష్టకు ఓ వ్యక్తి చాలా ఇబ్బంది పడ్డాడు. ఇంతకు అతను దగ్గర నుంచి ఏం తీసుకెళ్లిందని అనుకుంటున్నారా.. మొబైల్ ఫోన్. అది కూడా మాములు ఫోన్ కాదు.. ఐఫోన్.
యావత్ దేశం దృష్టి మొత్తం ఇప్పుడు అయోధ్య వైపు ఉంది. రామ మందిర ప్రారంభోత్సవం కోసం ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుండగా.. రాంలాలా కోసం వివిధ రాష్ట్రాల నుంచి రకరకాల బహుమతులు వస్తున్నాయి. ఈ క్రమంలో.. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌కు చెందిన యువ కళాకారుడు రాముడి కోసం ప్రత్యేకంగా తయారు చేశాడు.
సెంట్రల్ థాయ్‌లాండ్‌లోని సుపాన్ బూరిరి ప్రావిన్సులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులు మరణించినట్లు రెస్క్యూ పనులు చేపడుతున్న సిబ్బంది తెలిపారు.
పంజాబ్ లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసి విజయం నమోదు చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఈ ప్రకటన తర్వాత పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తుపై సందేహం నెలకొంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు ప్రతిపాదనను కాంగ్రెస్ రాష్ట్ర విభాగం నిరంతరం వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో.. పంజాబ్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు ఆప్‌తో పొత్తుకు అనుకూలంగా లేరు.
గ్లోబల్ మార్కెట్ బలహీన ధోరణి కారణంగా ఈరోజు స్టాక్ మార్కెట్ క్షీణతతో ప్రారంభమైంది. గురువారం సెన్సెక్స్, నిఫ్టీలలో భారీ క్షీణత కనిపించింది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే.. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పడిపోయి 72000 దిగువకు చేరుకుంది. నిఫ్టీ 21650 దిగువన ప్రారంభం కాగా... ఆ తర్వాత స్టాక్ మార్కెట్‌లో భారీ ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి.
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవంకు సంబంధించి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే నగరమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కాగా.. జనవరి 22న ప్రాణప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు రామమందిర సముదాయంలో హాజరుకానున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనబోమని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.. కాగా.. ఆ రోజున తమ తమ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడపనున్నట్లు తెలిపారు.
14 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకూడదన్న స్పీకర్ ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన (షిండే) చీఫ్ విప్ భరత్ గోగావాలే దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు శివసేనకు నోటీసులు జారీ చేసింది. జూన్ 2022లో చీలిక తర్వాత ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని సేన వర్గాన్ని నిజమైన రాజకీయ పార్టీగా ప్రకటిస్తూ.. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో షిండే గ్రూప్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా ఆటగాడు శివమ్ దూబే హైలెట్ గా నిలిచాడు. ఆడిన రెండు మ్యాచ్ ల్లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాదాడు. అంతేకాకుండా.. మ్యాచ్‌ని ముగించిన తీరు, స్పిన్నర్లపై స్ట్రోక్‌లు కొట్టిన తీరు.. మేనేజ్‌మెంట్‌ను తెగ అట్రాక్ట్ చేశాయి. అయితే.. ఈ ఫర్మార్మెన్స్ టీ20 ప్రపంచ కప్ 2024లో ఆడేందుకు బాటలు వేసింది. ఇదిలా ఉంటే.. బీసీసీఐ శివమ్ నుండి కొత్త డిమాండ్ ను కోరుతుంది. దూబే తన బౌలింగ్ సామర్థ్యాన్ని కూడా చూపించాలని బీసీసీఐ…