MLA Udaya Bhanu: ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీకి.. టీడీపీ నుంచి వైసీపీకి నేతలు మారుతున్నారు. ఈ క్రమంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీలోనే ఉన్నానని తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని.. ఇది తనపై జరుగుతున్న దుష్ప్రచారమని తెలిపారు.
Read Also: Nepal: త్రిశూలి నదిలో పడిపోయిన ఇండియా నంబర్ ప్లేట్ ఉన్న జీపు.. ప్రాణనష్టమేమీ లేదు..!
తాను వైసీపీలోనే ఉన్నాను.. వైసీపీలోనే కొనసాగుతానని ఉదయభాను అన్నారు. తాను పార్టీ మారుతున్నట్టు ఎవరికీ చెప్పలేదు, కావాలని ఇది ప్రచారం మాత్రమేనని పేర్కొన్నారు. ఉదయభాను జనసేనలో చేరి బెజవాడ పశ్చిమ నుంచి పోటీ చేస్తారని సోషల్ మీడియాలో గత 2 రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఉదయభాను స్పష్టత ఇచ్చారు.
Read Also: GVL: రిక్షావాలాగా మారిన బీజేపీ ఎంపీ.. రిక్షా తొక్కిన జీవీఎల్