శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసిన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం జగన్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సీఎం జగన్ తో కలిసి భవనాలను పరిశీలించారు. ఐఆర్ఎస్ కు ఎంపికైన అభ్యర్థులతో ప్రధాని మోదీ ముఖాముఖి నిర్వహించారు. ఐఆర్ఎస్ అభ్యర్థుల శిక్షణ కోసం రూ.1500 కోట్లతో 503 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ భవనాల నిర్మాణం చేపట్టింది. ఇప్పటి వరకు హర్యానాలో మాత్రమే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ కేంద్రం ఉండేది.
Dead Rat In Food: రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసిన ఆహారంలో ఎలుక, బొద్దింక.. ఆస్పత్రి పాలైన లాయర్..
అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. చారిత్రక ప్రదేశంలో నాసిన్ ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. నాసిన్‌ను ప్రారంభించడం ఆనందకరంగా ఉందని తెలిపారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట కోసం 11 రోజుల అనుష్టానం చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు.. పుట్టపర్తి సత్యసాయిబాబ జన్మస్థలం.. లేపాక్షిలో వీరభద్ర మందిరం దర్శించుకోవడం ఆనందంగా ఉందని ప్రధాని తెలిపారు. రామరాజ్య భావన నిజమైన భావన అని మహాత్మాగాంధీ చెప్పారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు సేవకులు అని తెలిపారు. గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదని.. జీఎస్టీ తీసుకువచ్చి పన్నులను సరళతరం చేశామన్నారు ప్రధాని. ప్రజల నుంచి వచ్చిన పన్నులు వారి సంక్షేమానికే వాడాలని.. ఇదే రామరాజ్య సందేశమని ప్రధాని మోదీ తెలిపారు.
కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. నాసిన్ కేంద్రం ఏపీలో ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలిపారు. మోదీ బిజీ షెడ్యూల్ లో కూడా ఏపీకి వచ్చి.. నాసిన్ భవనాలను జాతికి అంకితం చేయడం అదృష్టమని అన్నారు. 2014లో అప్పటి ప్రభుత్వం.. ప్రస్తుత ప్రభుత్వం నాసిన్ కేంద్రం ఏర్పాటుకు మంచి సహకారం అందించారని పేర్కొన్నారు.