Anirudh Ravichander: అనిరుధ్ ‘అల్బుకర్క్యూ రికార్డ్స్’తో కలిసిన యూనివర్సల్ మ్యూజిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగీత ప్రపంచంలో మరో సంచలనం నమోదైంది. గ్లోబల్ మ్యూజిక్ జెయింట్ యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా, సౌత్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ స్థాపించిన ‘అల్బుకర్క్యూ రికార్డ్స్’తో చేతులు కలిపింది. ఇండియన్ ఇండిపెండెంట్ మ్యూజిక్, ముఖ్యంగా సౌత్ ఇండియన్ పాప్, హిప్-హాప్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే ఈ బిగ్ కొలాబరేషన్ ప్రధాన ఉద్దేశ్యం. ఈ కొలాబరేషన్ ద్వారా అనిరుధ్ రూపొందించే ఫ్యూచర్ పాప్, హిప్-హాప్ ఆల్బమ్స్‌తో పాటు, ఈ లేబుల్ ద్వారా పరిచయమయ్యే కొత్త తరం కళాకారుల పాటలను కూడా యూనివర్సల్ మ్యూజిక్ గ్లోబల్‌గా ప్రమోట్ చేయనుంది. ఈ లేబుల్ కింద అనిరుధ్ పాల్గొన్న మొట్టమొదటి ప్రాజెక్ట్ ఏప్రిల్ లోనే విడుదల కాబోతోంది.
Also Read:Rakasa : భారీ మొత్తానికి రాకాస హక్కుల అమ్మకం
Also Read
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
- world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. 'భోగి' టీజర్ రిలీజ్
- Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
2012లో ‘కొలవెరి డి’తో ఇంటర్నెట్‌ను ఊపేసిన అనిరుధ్, గడిచిన 15 ఏళ్లలో అప్రతిహత విజయాలను అందుకున్నారు. 770కి పైగా పాటలతో 13 బిలియన్లకు పైగా ఆడియో స్ట్రీమ్స్ సాధించి, స్పాటిఫైలో అత్యధిక స్ట్రీమ్స్ కలిగిన దక్షిణ భారత కళాకారుడిగా నెంబర్-1 స్థానంలో నిలిచారు. ‘హుకుమ్’, ‘వాతీ కమింగ్’, ‘అరబిక్ కుతు’ వంటి పాటలతో ఆయన గ్లోబల్ మ్యూజిక్ మ్యాప్‌లో తన ముద్ర వేశారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఉన్న అపారమైన కళా సంపదను ప్రపంచానికి పరిచయం చేయడానికి యూనివర్సల్ మ్యూజిక్ పక్కా ప్లాన్‌తో ఉంది. దక్షిణాదిలో పెరుగుతున్న పాప్ మరియు హిప్-హాప్ కల్చర్‌ను క్యాష్ చేసుకోవడానికి అనిరుధ్ వంటి విజనరీ ఆర్టిస్ట్‌తో జతకట్టడం ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!