తమిళనాడులోని కాంచీపురంలో ఆలయ పూజారులు ఒకరి ఒకరు కొట్టుకున్నారు. అదేంటి.. పూజారులు కొట్టుకోవడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. నిజమేనండీ. వారు కొట్టుకున్నది ఒక పాట పాడే విషయంలో. నిజానికి.. కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ల ఆలయంలో కనుమ సందర్భంగా పార్వేట ఉత్సవ యాత్ర జరుగుతుంది. ఈ యాత్రకు పూజారులు భారీగా తరలి వస్తారు. కాగా యాత్రలో మొదటి పాట పాడే విషయంలో వివాదం తలెత్తింది. పూజారులు వడకలై, టెంకలైలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. అంతేకాకుండా.. చంపేస్తామంటూ వార్నింగులు కూడా ఇచ్చుకున్నారు.
అయోధ్యలోని శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 22న దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ హాలీడే ప్రకటిస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరామ మందిరంలోని గర్భగుడిలో రామ్‌లాలా కొత్త విగ్రహం 'ప్రాణ్‌ప్రతిష్ఠ' కార్యక్రమం సోమవారం జరగనుంది. ఈ వేడుకను ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్నారు.
దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటీ ఇన్‌స్టిట్యూట్ మరో ఆత్మహత్య వార్త సంచలనం రేపుతుంది. నెల రోజుల్లో ఇది ఆత్మహత్య ఘటన. ఇంతకు ముందు కొన్ని రోజుల్లోనే రెండు ఆత్మహత్య ఘటనలు నమోదయ్యాయి. ఆత్మహత్యలకు ప్రసిద్ధి చెందిన కాన్పూర్ ఐఐటీలో మరోసారి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ సంస్థ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ప్రియాంక అనే పీహెచ్‌డీ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకుని కనిపించింది. దీంతో పోలీసు యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుంది. వారితో పాటు ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని.. ఘటనపై…
కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో తెలుగు ప్రజల ఆశాజ్యోతి.. తెలుగు ప్రజల గుండెచప్పుడు, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు పన్నాగా వెంకటేశ్వర్లు స్వామి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం ఇన్చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి పాల్గొని.. నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలోని నౌషేరాలో ల్యాండ్‌మైన్ పేలింది. ల్యాండ్‌మైన్‌పై కాలుపెట్టడంతో పేలుడు సంబవించి భారత ఆర్మీ జవాన్ వీరమరణం పొందాడు. పేలుడులో మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. గాయపడిన సైనికులను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన సైన్యం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఎల్ఓసీ వెంబడి పెట్రోలింగ్ చేస్తుండగా ఓ జవాన్ ల్యాండ్ మైన్ పై అడుగుపెట్టడంతో ప్రమాదవశాత్తు ట్రిగ్గర్ అయ్యింది. దీంతో పేలుడు సంభవించి ముగ్గురు ఆర్మీ జవాన్లక తీవ్ర గాయాలయ్యాయి.
సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం అర్థరాత్రి ఒక కార్గో షిప్‌పై డ్రోన్ దాడి జరిగింది. ఆ తర్వాత భారత నావికాదళం చర్యలు చేపట్టింది. ఈ దాడిపై ఓడ సిబ్బంది భారత నౌకాదళానికి అత్యవసర హెచ్చరిక (SOS) పంపింది. సమాచారం అందిన వెంటనే డిస్ట్రాయర్ యుద్ధనౌక ఐఎన్ఎస్ విశాఖపట్నాన్ని పంపినట్లు భారత నావికాదళం వెల్లడించింది.
ప్రధాని మోదీ కేరళ టూర్ పై కాంగ్రెస్ విమర్శల వర్షం గుప్పించింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో మోదీ తరచూ కేరళలో పర్యటించడం వల్ల బీజేపీ అక్కడ ఖాతా తెరవబోదని కాంగ్రెస్ పేర్కొంది. కాగా.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వి.డి. భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్య విభేదాలు సృష్టించి మతం, ప్రార్థనా స్థలాలను రాజకీయాలతో కలపాలని చూస్తోందని కాంగ్రెస్ నేత సతీశన్ ఆరోపించారు.
టీమిండియా, అఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో అఫ్ఘాన్ బౌలర్లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రింకూ సింగ్ చుక్కలు చూపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (121), రింకూ సింగ్ (69) అజేయంగా నిలిచారు. ఒకానొక దశలో టీమిండియా 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత రోహిత్, రింకూ నిలకడగా ఆడి అఫ్ఘాన్ బౌలర్లకు ఊచకోత చూపించారు.
అయోధ్యలో బాలరాముడి దర్శనంతో భక్తులు పరవశించిపోయారు. 5 ఏళ్ల బాలుడి రూపంలో బాలరాముడి విగ్రహాన్ని తయారు చేశారు. మరో ఐదు రోజుల్లో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. కాగా.. బుధవారం తొలిసారిగా రామయ్య భక్తులకు దర్శనమిచ్చాడు. డప్పు, వాయిద్యాల మధ్య భారీ ఊరేగింపుతో బాలరాముడు అయోధ్య గుడిలోకి ప్రవేశించాడు. కాగా.. గురువారం గర్భగుడిలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ క్రమంలో.. బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. బాలరాముడి దర్శనంతో భక్తులు పరవశించి పోయారు.
కేరళలోని కన్నూర్‌లో ఒంటెపై పెళ్లి ఊరేగింపుగా వెళ్లినందుకు వరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతనితో పాటు 25 మంది సహచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు అభియోగాలు మోపారు. గుంపులుగా గుమికూడడం, ప్రజలకు ఇబ్బంది కలిగించడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం వంటి అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.