గుజరాత్‌లోని వడోదర హర్ని సరస్సులో పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. అందులో 14 మంది చిన్నారులతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. పడవలో మొత్తం 27 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారని, వారిలో ఎవరూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అంటున్నారు. విహారయాత్ర కోసమని పాఠశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బంది ఇప్పటి వరకు ఏడుగురు విద్యార్థులను రక్షించగా, తప్పిపోయిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
డీఎంకే నేత, పల్లవరం ఎమ్మెల్యే ఐ.కరుణానిధి కోడలుపై పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 18 ఏళ్ల పని మనిషి చెన్నైలోని ఎమ్మెల్యే కోడలు దగ్గర పని చేస్తుంది. అయితే తనను వేధింపులకు గురి చేసిందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ పని మనిషి తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా ఉలుందూర్‌పేటకు చెందినదిగా గుర్తించారు. తనను ఎమ్మెల్యే కోడలు మార్లీనా పదే పదే వేధించిందని, అంతేకాకుండా కొన్నిసార్లు కొట్టేదని ఉలుందూరుపేట పోలీసులకు తెలిపింది.
రామ మందిరంపై స్మారక తపాలా స్టాంపును ప్రధాని నరేంద్ర మోదీ గురువారం విడుదల చేశారు. దాంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా శ్రీరాముడిపై విడుదల చేసిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రారంభించారు. తపాలా స్టాంపు రూపకల్పనలో రామాలయం, చౌపాయి 'మంగల్ భవన్ అమంగల్ హరి', సూర్య, సరయూ నది, ఆలయం చుట్టూ ఉన్న విగ్రహాలు ఉన్నాయి. ఇవి.. భారతదేశం, అమెరికాతో సహా మొత్తం 21 దేశాలలో విడుదలయ్యాయి.
జల్లికట్టు ఎద్దుకు బలవంతంగా తినిపిస్తున్నట్లు చూపించిన వీడియోపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అంతేాకాకుండా ఆ వీడియోను పోస్ట్ చేసిన యూట్యూబర్‌పై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోను సేలం జిల్లా చిన్నప్పంపట్టిలో చిత్రీకరించారు. కాగా ఈ వీడియోలో ఒక ఎద్దుకు నోటిలో కోడిని పెట్టి నమలమని బలవంతం చేశారు. అంతేకాకుండా.. ముగ్గురు వ్యక్తులు ఎద్దును గట్టిగా పట్టుకోగా, ఒకరు కోడిని నోటిలో పెట్టడం లాంటివి చేశారు.
ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. పెద్ద, చిన్న అని తేడా లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కోచింగ్ క్లాస్‌లో 18 ఏళ్ల విద్యార్థి గుండెపోటుతో మరణించాడు. ఈ హృదయ విదారకమైన సంఘటన బుధవారం జరిగింది. మృతి చెందిన విద్యార్థి మాధవ్ గా గుర్తించారు. అయితే.. క్లాస్ మధ్యలో ఛాతిలో నొప్పిరావడంతో కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించగా.. యువకుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డయింది.
గుజరాత్‌లోని వడోదరలో తీవ్ర విషాదం నెలకొంది. హర్ని సరస్సులో పడవ బోల్తా పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. పడవలో ఉన్న వారు ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. మొత్తం పడవలో 27 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. వారిలో ఎవరూ కూడా లైఫ్ జాకెట్లు ధరించలేదని సమాచారం అందుతోంది. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సరస్సులో మునిగిపోయిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులు మృతి చెందగా.. గల్లంతైన వారు ఎంత…
అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు భారతీయ రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవం తర్వాత 'ఆస్తా' పేరుతో స్పెషల్ ట్రైన్లు నడుపుతామని తెలిపింది. మొత్తం 200కి పైగా ప్రత్యేక రైళ్లను ప్రారంభిస్తామని వెల్లడించింది. ఈ రైళ్లు దేశవ్యాప్తంగా 66 వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ అయోధ్యకు చేరుకుంటాయని పేర్కొంది. కాగా.. రామాలయానికి వెళ్లే భక్తుల కోసం ఒక్కో రైలులో 22 కోచ్‌లు ఉంటాయి. భక్తుల డిమాండ్‌ను బట్టి రైళ్ల సంఖ్యను తర్వాత పెంచనున్నారు. న్యూఢిల్లీ, పాత ఢిల్లీ, నిజాముద్దీన్, ఆనంద్…
రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి టికెట్ తీసుకోలేదని అతి దారుణంగా కొట్టాడు రైల్వే టీటీఈ. ఈ ఘటన బరౌనీ-లక్నో ఎక్స్‌ప్రెస్ లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. టికెట్ తీసుకోలేని పాపానికి మరీ ఇంత దారుణంగా ఎవరైనా కొడతారా.. టికెట్ లేకుంటే ఫైన్ వేయాలి కానీ, చేయి ఉంది కదా అని ఎలా పడితే అలా కొట్టేయడమేనా..?. ఇదిలా ఉంటే.. ఆ వ్యక్తిని అంత దారుణంగా కొడుతుంటే పక్కన ఉన్న ప్రయాణికులు కూడా ఏంటని ప్రశ్నించారు. వారిపై…
గతేడాది డిసెంబర్ లో అదృశ్యమైన ఓ మహిళ మృతదేహాన్ని నవీ ముంబై పోలీసులు మంగళవారం గుర్తించారు. ఖర్ఘర్ హిల్ కాంప్లెక్స్‌లోని అటవీ ప్రాంతంలో ఆమె కుళ్లిపోయిన మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ తన ప్రియుడు నుంచి దూరం కావడంతో ఆమెను గొంతు కోసి ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఓ వార్త కథనం తెలిపింది. మృతురాలు వైష్ణవి (19)గా గుర్తించారు. సియోన్‌లోని ఎస్‌ఐఈఎస్ కాలేజీలో చదువుతోంది. కాగా.. ఆ మహిళ 2023 డిసెంబర్ 12వ తేదీన ఉదయం కాలేజీకి అని…
రిపబ్లిక్ డేను దృష్టిలో ఉంచుకుని.. జనవరి 26న జమ్మూకశ్మీర్‌లో దాడికి ప్లాన్ చేశామని ఉగ్రవాది జావేద్ మట్టూ తెలిపాడు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం విచారణలో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ టెర్రరిస్ట్ హిజ్బుల్ ముజాహిదీన్ సభ్యుడిగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే.. హిజ్బుల్ ముజాహిదీన్ A++ కేటగిరీకి చెందిన ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టూ ఈ నెల జనవరి 4న అరెస్టయ్యాడు. కాగా.. అతన్ని పోలీసులు విచారించగా, ఈ విషయం బయటపడింది.