3 టీ20 సిరీస్ లో భాగంగా భారత్-అఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగుతుంది. అటు అఫ్ఘనిస్తాన్ జట్టులో కూడా మూడు మార్పులు చేశారు. మూడో టీ20లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ జితేష్ శర్మ, పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆడటం లేదు. వికెట్ కీపర్ సంజూ శాంసన్, ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లకు కెప్టెన్ రోహిత్ శర్మ అవకాశం ఇచ్చాడు.
Read Also: West Bengal: ఆస్తి వివాదం కారణంగా భార్యను ఆరు ముక్కలుగా చేసిన భర్త.. చివరికి..
టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్:
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్.
అఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్:
రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఉమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, మహ్మద్ సలీమ్ సఫీ, ఫరీద్ అహ్మద్ మలిక్.