గ్లోబల్ మార్కెట్ బలహీన ధోరణి కారణంగా ఈరోజు స్టాక్ మార్కెట్ క్షీణతతో ప్రారంభమైంది. గురువారం సెన్సెక్స్, నిఫ్టీలలో భారీ క్షీణత కనిపించింది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే.. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పడిపోయి 72000 దిగువకు చేరుకుంది. నిఫ్టీ 21650 దిగువన ప్రారంభం కాగా… ఆ తర్వాత స్టాక్ మార్కెట్‌లో భారీ ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి.
I.N.D.I.A Alliance: మతపరమైన కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయం చేస్తోంది..
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1,628 పాయింట్లు నష్టపోయి 71,500కి పడిపోయింది. నిఫ్టీ 460 పాయింట్లు కోల్పోయి 21,571కి దిగజారింది. ఇటీవల కాలంలో వరుసగా రికార్డు స్థాయిలో సాక్ట్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ షేర్లలో భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, నెస్లే, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్‌టిపిసి, ఐటిసి టాప్ గెయినర్‌లలో ఉండగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో భారీ నష్టాలను చవిచూశాయి.
Tummala Nageswara Rao : రైతులకు గుడ్‌న్యూస్.. ఈ నెలాఖరులోగా రైతుబంధు
వీటితో పాటు యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు కూడా నష్టాల్లో బాటలోనే కొనసాగాయి. ఈ క్షీణత కారణంగా, నిఫ్టీ బ్యాంక్ ప్రారంభ ట్రేడ్‌లో 1,202.4 పాయింట్లు లేదా 2.50% నష్టంతో ట్రేడవుతోంది. ఇక ఇతర రంగాల గురించి మాట్లాడితే, క్యాపిటల్ గూడ్స్, ఐటీ కంపెనీల షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి.