కోతులు చేసే వింత చేష్టలు ఒక్కోసారి నవ్వు తెప్పిస్తే.. ఒక్కోసారి చిరాకు తెప్పిస్తాయి. అయితే ఇప్పుడు.. ఓ కోతి చేసిన వింత చేష్టకు ఓ వ్యక్తి చాలా ఇబ్బంది పడ్డాడు. ఇంతకు అతను దగ్గర నుంచి ఏం తీసుకెళ్లిందని అనుకుంటున్నారా.. మొబైల్ ఫోన్. అది కూడా మాములు ఫోన్ కాదు.. ఐఫోన్.
West Bengal: ఆస్తి వివాదం కారణంగా భార్యను ఆరు ముక్కలుగా చేసిన భర్త.. చివరికి..
మాములుగా అయితే చేతిలో ఏమైనా తినుబండరాలు లాంటివి ఉంటే.. వెంటనే దాన్ని లాక్కుని వెళ్తాయి. అంతేకాకుండా.. చేతుల్లో ఏమీ కనపడ్డా సరే, ఎత్తుకెళ్లడానికే ప్రయత్నిస్తాయి. వాటి కోసం మనుషుల పై దాడి చేసి మరీ ఎత్తుకుని పారిపోతాయి. అయితే ఇక్కడ ఓ కోతి.. ఓ వ్యక్తి ఐఫోన్ తీసుకుని వెళ్లిపోయింది. బృందావనంకు చెందిన ఓ వ్యక్తి వద్ద నుంచి కోతి ఐఫోన్ ఎత్తుకెళ్లింది. శ్రీరంగనాథ్ జీ మందిరంలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
Ram Mandir Model: 20 కిలోల బిస్కెట్లతో రామమందిర నమూనా..
ఈ వీడియోలో రెండు కోతులు ఓ గోడపై కూర్చున్నాయి. వాటిలో ఒకటి ఫోన్ పట్టుకుని ఉంది. అయితే కోతి బారినుండి ఫోన్ ను ఎలా పొందగలమో అని కింద జనాలు గుమిగూడారు. అయితే ఫోన్ కోసం రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. వారిలో ఒకరు ఆ కోతికి ఫ్రూటీ ప్యాకెట్ విసిరారు. అంతే దానిని పట్టుకున్న కోతి చేతిలో ఉన్న ఫోన్‌ని వదిలేసింది. వెంటనే అప్రమత్తమైన వ్యక్తి ఫోన్‌ను క్యాచ్ పట్టుకున్నాడు. ఈ వీడియోను ‘బృందావనంలో కోతులు’ అనే శీర్షికతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కాగా.. ఈవీడియోపై సోషల్ మీడియాలో కామెడీగా స్పందిస్తున్నారు.