Rajesh Veeramalla
Author- NTV Telugu-
K. Keshava Rao: తెలంగాణలో హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలు హీరోలు..
బీఆర్ఎస్ భవన్ లో సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె .కేశవ రావు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. జెండా మోసిన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా.. ఉద్యమకారుల్లో ఉన్న అసంతృప్తిని గుర్తించాం.. వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుంది అని అన్నారు. కాగా.. తెలంగాణలో హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలు హీరోలు అని పొగిడారు. -
Fire Accident: బంజారాహిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం.. మూడు కార్లు దగ్ధం
హైదరాబాద్ బంజారాహిల్స్ లో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్ నెంబర్. 4లోని ఓ ప్రైవేట్ హోటల్ పార్కింగ్ ప్లేస్ లో ఉన్న మూడు కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనపై వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. కాగా, ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
Uttam Kumar Reddy: తెలంగాణను నాశనం చేసింది, ద్రోహం చేసింది, దోచుకుంది బీఆర్ఎస్సే..
రాష్టాన్ని బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణను నాశనం చేసింది, ద్రోహం చేసింది, దోచుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, అలా చేయడం తగదని మంత్రి ఉత్తమ్ సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.3 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్లు భారం పెంచిందని తెలిపారు. -
Bhatti Vikramarka: ధనిక రాష్టాన్ని బీఆర్ఎస్ చేతుల్లో పెడితే ఆగం అయ్యింది..
సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం పౌర సరఫరాల శాఖ రూపొందించిన ప్రతిపాదనల పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సివిల్ సప్లై శాఖ బడ్జెట్ ప్రిపరేషన్ పై చర్చ జరిగిందని అన్నారు. పేదవాడికి బియ్యం సప్లై చేసే శాఖ పై గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. 2014-15లో రూ.383 కోట్లు ఏరియర్స్ ఉంటే.. సంవత్సరానికి పెరుగుతూ వచ్చిందనని తెలిపారు. రూ.14వేల… -
CID: పదేళ్ల తర్వాత తెలంగాణలో మొదటిసారి సీఐడి కేసు..
తెలంగాణలో పది సంవత్సరాల తర్వాత మొదటిసారి సీఐడి కేసు నమోదు అయింది. నకిలీ వీసా, పాస్ పోర్టులు ఇప్పిస్తున్న ముఠాను సీఐడి అధికారులు పట్టుకున్నారు. కాగా.. ఐదు జిల్లాల్లో మూకుమ్మడిగా సోదాలు నిర్వహించింది. తెలంగాణలో సీఐడి అధికారుల దాడులు చేపట్టిన ప్రదేశాల్లో.. హైదరాబాద్, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్, కరీంనగర్ లలో సోదాలు చేపట్టారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో పాస్ పోర్టులు.. విదేశీయులకు పాస్‌పోర్టులు పొందేందుకు అవసరమైన నకిలీ పత్రాలు తయారీ చేస్తుంది ముఠా. -
Ponguleti Srinivas Reddy: ఇది ప్రజా ప్రభుత్వం.. ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా పని చేస్తాం
హన్మకొండ కలెక్టరేట్లో అధికారులతో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఆర్భాటంగా ప్రారంభించిన పథకాల పైన చర్చ జరిగిందని తెలిపారు. ప్రధానంగా ఇరిగేషన్ పైన చర్చించామన్నారు. మిషన్ భగీరథ, కాలువలు తవ్వని అంశం చర్చకు వచ్చిందని తెలిపారు. ఫారెస్టు క్లియరెన్స్ కోసం ఏమి చేయాలనే దానిపై చర్చించామన్నారు. అంతేకాకుండా.. 6 గ్యారెంటీల పథకాల కోసం సేకరించిన దరఖాస్తులు గురించి చర్చించామని మంత్రి పేర్కొన్నారు. -
Deputy CM: రోడ్లు భవనాల శాఖకు నిధులు కేటాయిస్తాం- భట్టి విక్రమార్క
సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోడ్లు, భవనాలు, రైల్వే బ్రిడ్జిలు, సినిమా పరిశ్రమకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల ప్రతిపాదనలపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రోడ్లు, భవనాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం కేటాయింపులు పేపర్లలో చూపించి, చెల్లింపులు చేయని కారణంగా చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని.. పదిసార్లు టెండర్లు పిలిచినా, పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఉందని మంత్రి కోమటిరెడ్డి ఆర్ధికమంత్రి దృష్టికి… -
Komuravelli Railway Station: మల్లన్న భక్తులకు శుభవార్త.. కొమురవెల్లిలో కొత్త రైల్వే హాల్ట్ స్టేషన్
కొమురవెల్లి మల్లన్న భక్తుల సుదీర్ఘ కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. మనోహరాబాద్-కొత్తపల్లి మధ్యలో కేంద్రప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న రైల్వే మార్గంలో ఉన్న కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ నిర్మించి.. భక్తులకోసం రైలు ఆగేందుకు మార్గం సుగమమైంది. కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ అవసరం, భక్తుల సౌకర్యాన్ని వివరిస్తూ.. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పలుమార్లు రైల్వేశాఖ మంత్రికి లేఖలు రాయడంతో పాటుగా.. ప్రత్యేకంగా కలిసి ఈ విషయంలో చొరవతీసుకోవాలని కోరారు. దీని సాధ్యాసాధ్యాలపై చర్చించిన రైల్వేశాఖ.. కొమురవెల్లి మల్లన్న జాతర సందర్భంగా రైల్వే హాల్ట్ స్టేషన్ నిర్మాణానికి… -
Seethakka: ఆ డైలాగ్తో కేటీఆర్కు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్..
మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని.. లేదంటే వారి తరుఫున గొంతు విప్పుతామని కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలో తాజాగా మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ.. వెయ్యి పశువులను తిన్న రాబంధు నీతి కథలు చెప్పినట్టు కేటీఆర్ వ్యవహారం ఉందంటూ కౌంటర్ వేశారు. సర్పంచ్‌లకు నిధులు ఇవ్వకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోష పెట్టిందన్నారు. కేటీఆర్ ఇప్పుడు సర్పంచ్‌ల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. -
Governor Tamilisai: గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. దర్యాప్తు వేగవంతం
తెలంగాణ గవర్నర్ తమిళిసై సోషల్ మీడియా ఎక్స్ ఖాతా హ్యాక్ పై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ నెల 14న గవర్నర్ ట్విట్టర్ (ఎక్స్) ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. రాజ్‌భవన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేశారు.
తాజావార్తలు
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!