తెలంగాణ గవర్నర్ తమిళిసై సోషల్ మీడియా ఎక్స్ ఖాతా హ్యాక్ పై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ నెల 14న గవర్నర్ ట్విట్టర్ (ఎక్స్) ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. రాజ్‌భవన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేశారు.
బీజేపీ ఉన్నదా ? లేదా ? అన్నది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చూపెడతామని అన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబంలో KCR, KTR, కవిత, హరీష్, సంతోష్ ఈ ఐదుగురు పోటీ చేయాలని సవాల్ చేశారు. కాగా.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్ గత పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లను అమ్ముకున్నారని దుయ్యబట్టారు. హరీష్ రావు రాజకీయాల్లోకి రాకముందే…
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకోవడంపై సానియా మీర్జా తండ్రి స్పందించారు. మాలిక్- సానియా మీర్జా విడాకులు తీసుకున్నారని అని తెలిపారు. 'షరియా చట్టంలో ఉన్న ఖులా పద్ధతి ప్రకారం ముస్లిం మహిళ భర్తకు విడాకులు ఇచ్చే స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. తన కూతురు సానియా కూడా ఖులా ప్రకారం షోయబ్ కు విడాకులు ఇచ్చిందని పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తన మనసులో మాటను బయటపెట్టారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయ్యాడు. ఇదిలా ఉంటే.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. గత ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన హమీలను ప్రజలు నమ్మలేదని సంపత్ పేర్కొన్నారు. దళితులని మోసం చేసేందుకు ఎస్సీ వర్గీకరణ మీద బీజేపి కమిటీ వేసిందని దుయ్యబట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే శాసన సభలో ఎస్సీలని ఏబీసీడీలుగా వర్గీకరణ…
కాంగ్రెస్ మంత్రులపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేఆర్ఎంబీలో తెలంగాణ చేరిందని కేంద్రం సమావేశ మినిట్స్ లో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. ఇప్పుడు చేరలేదని రాష్ట్ర మంత్రులు బుకాయిస్తున్నారని ఆరోపించారు. మంత్రుల నోటి మాట ప్రామాణికమా? మినిట్స్ ప్రామాణికమా? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ మంత్రులు చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు.
మనీలాండరింగ్ కేసులో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్, ఆయన కుమారుడు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా పాట్నా కార్యాలయంలో హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోరింది. భూములు తీసుకుని.. బదులుగా రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చారన్న ఆరోపణలతో నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈ ఇద్దరు నేతలను విచారించనున్నారు.
గణతంత్ర దినోత్సవ పరేడ్, బీటింగ్ రిట్రీట్ వేడుకలు, రాష్ట్రపతి భవన్‌లో 'ఎట్ హోమ్' కార్యక్రమాల దృష్ట్యా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను త్వరగా మూసివేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని వెల్లడించింది. జనవరి 23న నిర్వహించబోయే రిహార్సల్ కోసం సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్, వాయు భవన్, ఉద్యోగ్ భవన్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు జనవరి 22 సాయంత్రం 6.30 గంటల నుండి 23వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు మూసివేయాలని తెలిపింది. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ…
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) నిరసన చేపట్టనుంది. ఫిబ్రవరి 8న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపనున్నట్లు పేర్కొంది. కేరళ, ఇతర బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను కేంద్రం ఆర్థికంగా నిర్లక్ష్యం చేసిందని ఆందోళన చేయడం ఈ నిరసన లక్ష్యమన్నారు. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ తెలిపారు. ఇది.. కేవలం కేరళ సమస్యలకు సంబంధించినది కాదని, ఇతర బీజేపీయేతర రాష్ట్రాలు పంచుకుంటున్న విస్తృత ఆందోళనకు ప్రతినిధి అని ఆయన…
సీనియర్ ఐపీఎస్ అధికారి దల్జీత్ సింగ్ చౌదరి శుక్రవారం సశాస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బి) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. అందుకు సంబంధించి.. సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో ఈ సమాచారం అందించింది. ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి అయిన చౌదరి.. ప్రస్తుతం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ప్రత్యేక డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు.
నాలుగేళ్ల కిందట సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య రామ జన్మభూమి కేసుపై చారిత్రాత్మక అంతిమ తీర్పునిచ్చింది. ఇప్పుడా ఐదుగురు న్యాయమూర్తులకు ప్రాణ ప్రతిష్ట ఆహ్వానం అందింది. ఈ న్యాయమూర్తులందరినీ రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రాష్ట్ర అతిథులుగా ఆహ్వానించారు. అంతే కాకుండా.. మాజీ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, ఉన్నత న్యాయవాదులతో సహా 50 మందికి పైగా న్యాయనిపుణులకు ఆహ్వానాలు పంపారు. ఆహ్వానితుల జాబితాలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కూడా ఉన్నారు.