హన్మకొండ కలెక్టరేట్లో అధికారులతో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఆర్భాటంగా ప్రారంభించిన పథకాల పైన చర్చ జరిగిందని తెలిపారు. ప్రధానంగా ఇరిగేషన్ పైన చర్చించామన్నారు. మిషన్ భగీరథ, కాలువలు తవ్వని అంశం చర్చకు వచ్చిందని తెలిపారు. ఫారెస్టు క్లియరెన్స్ కోసం ఏమి చేయాలనే దానిపై చర్చించామన్నారు. అంతేకాకుండా.. 6 గ్యారెంటీల పథకాల కోసం సేకరించిన దరఖాస్తులు గురించి చర్చించామని మంత్రి పేర్కొన్నారు.
Read Also: Deputy CM: రోడ్లు భవనాల శాఖకు నిధులు కేటాయిస్తాం- భట్టి విక్రమార్క
కాగా.. సమ్మక్క సారక్క మహాజాతరకు రూ.105 కోట్లతో పనులు చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం వారి అవసరాల కోసం చేపట్టిన ప్రాజెక్టులు పరిస్థితి పైనా సమలోచన చేశామని పేర్కొన్నారు. ఏవి సాధ్యం.. ఏవి కాదు అనే అంశం చర్చకు వచ్చిందన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం.. ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా పని చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. 30 ఏళ్ళుగా రాజకీయల్లో ఉన్నాను.. ప్రజల సమస్యలను అనుకూలంగా కాంగ్రెస్ పని చేస్తోందని అన్నారు. రూ.300 కోట్లు పనులు శిలాఫలకాలు వేసి వెళ్లిపోయారు.. వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలలో అర్ధం కావడం లేదని తెలిపారు. అధికారుల వారి సమస్యలు చెప్పుకొనే స్వచ్ఛ ఈరోజు వచ్చిందని సీతక్క అన్నారు.
Read Also: Suicide: రూ.500 కోసం భార్యాభర్తలు ఆత్మహత్య