నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలతో ఎమ్మెల్యే ఆర్థర్ ఈరోజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగినంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా పోటీలో ఉంటానని తెలిపారు. రెండు రోజుల్లో తన నిర్ణయం చెబుతానన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకే నిర్ణయం తీసుకుంటానని ఎమ్మెల్యే ఆర్థర్ తెలిపారు. కాగా.. నందికొట్కూరు వైసీపీ అభ్యర్థిగా డా.సుధీర్ ను అధిష్టానం ప్రకటించింది. నందికొట్కూరు నుంచి తనను తప్పించడంతో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు…
పొత్తులో భాగంగా టీడీపీ హైకమాండ్కు వివిధ జిల్లాల్లోని కీలక సెగ్మెంట్లు సంకటంగా మారుతున్నాయి. పెందుర్తి, రాజమండ్రి రూరల్, పిఠాపురం, కాకినాడ, అవనిగడ్డ, విజయవాడ పశ్చిమం, తెనాలి సెగ్మెంట్లపై టీడీపీ ఏటూ తేల్చుకోలేకపోతోంది. ఈ క్రమంలో విజయవాడ పశ్చిమ నేతలు రోజురోజుకూ ఒత్తిడి పెంచుతున్నారు. తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలంటూ టీడీపీ అధిష్టానానికి పశ్చిమ నేతల వినతులు ఇస్తున్నారు. విజయవాడ పశ్చిమం నుంచి బీసీ వర్గానికి చెందిన బుద్దా వెంకన్న టిక్కెట్ ఆశిస్తున్నారు. కాగా.. రేసులో మైనార్టీ వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, నాగుల్…
జనసేన పార్టీలో చేరుతున్నానని ఎంపీ బాలశౌరి మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు మోపిదేవిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. మీటింగ్ అనంతరం బాలశౌరి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ తో రెండు గంటలు సమావేశం అయినట్లు తెలిపారు. మంచి ఆలోచన ఉన్న వ్యక్తి పవన్ అని అన్నారు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ది చేయాలి అనే ఆలోచన పవన్ కల్యాణ్ కు ఉందని ఎంపీ తెలిపారు.
కొణతాల సేవలు పార్టీకి ఉపయోగకరం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన పార్టీలో చేరేందుకు కొణతాల నిర్ణయించుకోవడం హర్షణీయం అని అన్నారు. సుదీర్ఘ కాలంగా ప్రజా జీవితంలో ఉన్న ఆయన.. జనసేనలోకి రావడం మంచి పరిణామమని పేర్కొన్నారు. కొణతాల రామకృష్ణను పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. క్షేత్ర స్థాయి సమస్యల పరిష్కారం గురించి, రాష్ట్రాభివృద్ధి గురించి స్పష్టత కలిగిన నాయకుడు కొణతాల అని అన్నారు. పార్టీ శ్రేణులు, నాయకులు ద్విగుణీకృత ఉత్సాహంతో పని చేసేందుకు, పార్టీ మరింత బలోపేతం…
కాంగ్రెస్ అగ్రనేత చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఈ యాత్రలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొ్న్నారు. కాగా.. ఈ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు మరోసారి దాడి చేశారంటూ ఆరోపిస్తున్నారు. కాగా.. శనివారం కూడా బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి పాల్పడింది. ఆ దాడిని కాంగ్రెస్ ఖండించింది. అధికార పార్టీ బీజేపీ.. దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి హక్కును 'అణచివేస్తోందని' ఆరోపించింది. రాజ్యాంగాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.…
జనసేన ఎన్నికల నిర్వహణ కమిటీలతో పార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. కాగా.. ఎన్నికల నిర్వహణ జోనల్ కమిటీని 191 మందితో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మరోవైపు.. ఎన్నికల్లో గెలుపుకు రెండు నెలలు పూర్తి స్థాయిలో అందరూ పనిచేయాలని నాదెండ్ల మనోహర్ కోరారు.
(రేపు) సోమవారం అయోధ్యలో రామమందిరప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. అందుకు సంబంధించి దేశంలోని హిందూ సమాజంలో సంబరాల వాతావరణం నెలకొంది. కాగా.. అయోధ్యలో ప్రతిష్టంచనున్న బాలరాముడిని దర్శించుకునేందుకు దేశంలోని నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే రామభక్తులు తమ భక్తిని చాటుతూ వెలుగులోకి వస్తున్నారు. రామభక్తుడైన బాబా బద్రి.. మధ్యప్రదేశ్ దామోహ్‌లోని బటియాగఢ్ నుంచి బయలుదేరిన రామభక్తుడు బద్రీ బాబా.. ఐదు వందల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి అయోధ్య చేరుకున్నారు. అంతేకాదు.. అతను తన శిఖరం నుండి శ్రీరామచంద్రుని రథాన్ని లాగుకుంటూ అయోధ్యకు…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని రామేశ్వరంలో పర్యటించారు. అందులో భాగంగా రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ప్రధాని ఇక్కడి అగ్ని తీర్థంలో సముద్ర స్నానమాచరించారు. అంతేకాక ఆలయంలోని తీర్థ బావుల పవిత్ర జలాలనూ ఒంటిపై పోసుకున్నారు. అనంతరం 'శ్రీరామాయణ పారాయణ' కార్యక్రమంలో పాల్గొన్నారు.
అండర్ -19 వరల్డ్ కప్ లో భారత్ విక్టరీ కొట్టింది. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ఆ తర్వాత 252 పరుగుల పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 167 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్లలో ఆదర్శ్ సింగ్ (76), ఉదయ్ సహారన్ (64) పరుగులతో రాణించారు. ఇక బౌలర్లలో శౌమీ పాండే…
చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం ఫోన్ చేసి దిగజారుడు మాటలు మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన మనుషులను ఎలా కలుస్తారని కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి రంజిత్ రెడ్డి అడిగారు. దీంతో స్పందించిన విశ్వేశ్వర్ రెడ్డి నీకు దమ్ముంటే నా వాళ్లను తీసుకెళ్లు అని కౌంటర్ ఇచ్చారు. ఇరువురి మధ్య మాటమాట పెరిగింది. ఈ క్రమంలో.. ఫోన్ లోనే వాగ్వాదానికి దిగారు విశ్వేశ్వర్…