రేపటి నుంచి నీల మేఘ శ్యాముడు భక్త జన కోటికి దర్శనం ఇవ్వనున్నారు. మంగళవారం నుంచి సామాన్య భక్తులకు బాలరాముడు దర్శనం ఇవ్వనున్నారు. బాలరాముడి దర్శించుకునేందుకు ఆలయ ట్రస్ట్ రెండు స్లాట్స్ ఖరారు చేసింది. ఉదయం 7 గంటల నుంచి 11: 30 గంటల వరకు.. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకునేందుకు అనుమతించనున్నారు.
అయోధ్యలో అపురూప రామ మందిరం ఆవిష్కృతమైంది. జయజయ ధ్వానాల మధ్య బాలరాముడు ఆలయంలో కొలువుదీరారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా అభిజిత్ లఘ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. కాగా.. రామమందిర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన బీజేపీ సీనియర్ నేతలు ఉమాభారతి, సాధ్వి రితంభరరు రామ మందిర ప్రాంగణంలో కలుసుకున్నారు. అంతేకాదు.. మందిర ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే భావోద్వేగానికి గురయ్యారు. తమ కల నిజమైందని భావోద్వేగంతో కౌగిలించుకున్నారు. కాగా.. వారు భావోద్వేగానికి లోనైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయోధ్యలోని రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి దేశ నలుమూలల నుంచి వేలాది మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. "మేము గాంధీ రాముడిని పూజిస్తాము, బీజేపీకి చెందిన రాముడిని కాదు" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
500 సంవత్సరాల హిందువుల కల నెరవేరిందని అన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. అన్ని దారులూ రామ మందిరం వైపే చూపిస్తున్నాయని తెలిపారు. మనం త్రేతాయుగంలోకి వచ్చినట్లుంది.. ఈ క్షణం కోసం 500 ఏళ్లుగా ఎదురు చూశామని ఆయన చెప్పారు. ప్రాణ ప్రాతిష్ఠకు హాజరైన వారి జీవితం ధన్యమైందని పేర్కొన్నారు. అనుకున్న చోటే రామాలయం నిర్మించాం.. అయోధ్యకు పూర్వ వైభవం వచ్చిందని సీఎం యోగి తెలిపారు. బాలరాముడి రూపాన్ని చెక్కిన శిల్పి జీవితం ధన్యమైందని అన్నారు.
శ్రీరామచంద్రమూర్తికి జై అంటూ ప్రధాని ప్రసంగం ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా నిరిక్షిస్తున్న రాముడు వచ్చేశాడు.. ఈ క్షణం ఎంతో ప్రత్యేకమన్నారు. మన రామ్లల్లా ఇప్పటి నుంచి టెంట్ లో ఉండడు.. దివ్యమందిరంలో ఉంటాడు.. మీ అందరి ఆశీస్సుల వల్లే జరిగిందని మోడీ తెలిపారు. ఎన్నో ఏళ్ల పోరాటాలు, బలిదానాలు, నిష్ట తర్వాత అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని తెలిపారు. ఇది సామాన్యమైన సమయం కాదు.. కాలచక్రంలో ఎప్పటికి నిలిచిపోయే అద్భుత సమయమని పేర్కొన్నారు. ఎక్కడ రాముడి కార్యక్రమం జరుగుతుందో.. అక్కడ హనుమంతుడు ఉంటాడు.. సరయూ నది,…
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వైసీపీ సామాజిక సాధికార చైతన్య యాత్ర బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో సూళ్లూరు పేట నుంచి వైసీపీ అభ్యర్థిగా సంజీవయ్యను పార్టీ నిర్ణయించిందని తెలిపారు. అత్యధిక మెజారిటీతో ఆయనను గెలిపించాలని ఆయన కోరారు. ఆయన గెలుపు కోసం అందరూ కలిసి పని చేయాలన్నారు.
రేపు (సోమవారం) అంగన్వాడీ కార్యకర్తలు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. సుమారు 41 రోజుల నుంచి అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. గత ఐదు రోజులుగా విజయవాడలో అంగన్వాడీలు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వామ పక్ష నేతలు, కార్మిక సంఘాల నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే సీపీఎం నేత బాబురావును హౌస్ అరెస్ట్ చేశారు. కాగా.. నగరంలోకి వచ్చే వారిపై పూర్తి స్థాయి వివరాలు…
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వైసీపీ సామాజిక సాధికార చైతన్య యాత్ర బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజకీయ పదవులను ఇచ్చారని తెలిపారు. మరోవైపు.. చంద్రబాబు ఎస్సీలను అవమానించారని, ఎస్సీలుగా ఎవరైనా పుడతారా అని అన్నారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్ పథకాల పేరుతో ప్రజలను దగా చేసాడని.. ఈసారి జగన్ మాయమాటలు నమ్మి ఓటేస్తే ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లేనని బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటాపురం, పండ్లపురం గ్రామాల్లో పర్యటించిన బీసీ జనార్థన్ రెడ్డి.. బాబు ష్యూరిటీ–భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన నాలుగున్నరేళ్లలో కరెంటు బిల్లులు మూడు రెట్లకు పైగా పెంచి సామాన్యుల నడ్డి విరిచిన ఘనత…
షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాదు ఎవరు వచ్చిన తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయలేరన్నారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగలేదని చెప్పడానికి వాళ్ళేవారని ప్రశ్నించారు. రమ్మనండి ఛాలెంజ్ చేస్తున్నాం.. తమతో వస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపిస్తామని తెలిపారు. తెలంగాణలో రాజకీయాలు చేసి ఇప్పుడు ఆంధ్రాకు వచ్చి ఆమె మాట్లాడితే ఎలా అని దుయ్యబట్టారు.