గోల్కొండ హోటల్లో దక్షిణ రాష్ట్రాల CACP సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచేరి, తెలంగాణ రాష్ట్రాల వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. రైతులు పండించే ప్రతి పంటకు సాగు ఖర్చు తగ్గట్టుగా MSP ధరలు రావడం లేదని, డా. స్వామినాథన్ కమిషన్ ఆధారంగా MSP ధరలను నిర్ణయించాలని CACP కమిషన్ కు సూచించారు.
Read Also: Chandrababu: వైసీపీ పాలనలో ఏ ఒక్కరూ ఆనందంగా లేరు..
ప్రస్తుత మార్కెట్ ధరలు రైతులకు గిట్టుబాటుగా లేవని పెట్టుబడి ఖర్చులు, లేబర్ ఖర్చులను దృష్టిలో పెట్టుకొని MSP నిర్ణయించాలని మంత్రి తుమ్మల తెలిపారు. ఆయిల్ పామ్ కు కూడా మినిమమ్ MSP నిర్ణయించాలని కోరారు. క్వింటాలుకు రూ.18000 ఉండాలని విజ్ఞప్తి చేశారు. మిగతా రాష్ట్రాల రైతు ప్రతినిధులు, అధికారులు కూడా సాగు ఖర్చులకు అనుగుణంగానే MSPని ఆయిల్ పామ్, పసుపు, మిర్చికు ఉండాలన్నారు. ఆయిల్ పామ్ కు FFB ధర రూ.15000 టన్నుకు తగ్గకుండా చూడాలని CACP వారిని కోరుతూ మంత్రి తుమ్మల లేఖని అందజేశారు.
Read Also: Tillu Square: ‘దేవర’ ఆగమనంతోనే టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ లింక్?