కర్నూలు జిల్లా పత్తికొండ టీడీపీ కార్యాలయంలో మంత్రాలయం నియోజకవర్గ ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నెల 25న పత్తికొండలో రా..కదిలి రా కార్యక్రమం జరుగనుందని, ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు విజయవంతం చేయాలని తిక్కారెడ్డి కోరారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర అసోం చేరుకుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో పడవ ప్రయాణం చేసి శ్రీశ్రీ ఔనియతి సత్రానికి చేరుకున్నారు. అందులోని కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అతనితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, రాష్ట్ర అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా పలువురు అగ్ర నాయకులు ఉన్నారు. 'X' లో రాహుల్ గాంధీ పోస్ట్ చేస్తూ "ఈ రోజు నేను శ్రీశ్రీ ఔనియతి సత్రాన్ని సందర్శించడానికి అస్సాంలోని…
నోయిడాలో పట్టపగలే దారుణ ఘటన చోటు చేసుకుంది. కారులో వెళ్తున్న వ్యక్తిని బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు గన్ తో కాల్చారు. జిమ్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు సూరజ్ భాన్ గా గుర్తించారు. నిందితులు ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు.
అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా.. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, ప్రముఖ న్యాయవాది పరాశరన్ నుండి అదార్ పూనావాలా వరకు ఐదు వందల మందికి పైగా ప్రత్యేక అతిథులు రానున్నారు. ఈ క్రమంలో.. 100 చార్టర్డ్ విమానాలు రానున్నాయని శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ అంచనా వేస్తుంది. అందుకోసం.. విమానాల పార్కింగ్ కోసం 12 విమానాశ్రయాలను సంప్రదించారు. వీఐపీలను మూడు కేటగిరీలుగా విభజించారు.
అయోధ్యలో ప్రాణ ప్రతిష్టకు ముందే బాలరాముడి దివ్య రూపం దర్శనమిచ్చింది. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ రాముడి దివ్య రూపాన్ని విడుదల చేసింది. జనవరి 22న ఆలయ గర్భగుడిలో ఇదే విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. కాగా.. ఈ విగ్రహం కృష్ణ శిలతో తయారైంది. విగ్రహం పొడవు 51 అంగుళాలు.. బరువు 150 కేజీలు. అయితే.. బాలరాముడి విగ్రహం గురువారం గర్భాలయానికి చేరుకుంది. ప్రస్తుతం బాలరాముడి విగ్రహం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ లల్లా విగ్రహాన్ని చూసిన భక్తులు.. 'జై శ్రీరాం, జైశ్రీరాం' అంటూ పులకించిపోతున్నారు.
ఇప్పుడు ఎవరి నోట విన్న అయోధ్య మాటే. అందరి చూపు అయోధ్య వైపు. జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ వేడుకను ప్రధాని మోదీ నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. ఈ వేడుకలో దేశ, విదేశాల ప్రముఖులు పాల్గొననున్నారు. కాగా.. శ్రీరాముడు పుట్టిన తేదీ క్రీస్తుపూర్వం 5114వ సంవత్సరం, జనవరి 10న మధ్యాహ్నం 12.05 నిమిషాలకు అని ఇనిస్ట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ గణాంకాలతో నిర్ధారించింది. మహాభారతం, రామాయణాలు, పౌరాణిక ఇతిహాసాలు.. కేవలం కల్పిత కావ్యాలు కావని, అవి చారిత్రక గ్రంధాలని సంస్థ…
జనవరి 22న రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా.. అయోధ్యలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానించిన వీవీఐపీల భద్రత కోసం 45 ప్రత్యేక బృందాలు గస్తీ కాస్తోంది. ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు రాక సందర్భంగా ముందే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అయోధ్య చేరుకుంది. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం నుంచి ఆలయంలోకి సామాన్య భక్తులను ఎవరిని అనుమతించరు. ప్రాణ ప్రతిష్ట జరిగిన మరుసటి రోజు నుంచి భక్తులకు రాముడి దర్శనం ఉంటుందని ఆలయ ట్రస్ట్ తెలిపింది.
ప్రధాని మోదీ శుక్రవారం మహారాష్ట్రలోని షోలాపూర్ లో పర్యటించారు. అక్కడ.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ పథకం కింద పేద ప్రజలకు ఆయన చేతుల మీదుగా ఇళ్లను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలోనే పీఎం ఆవాస్ యోజన కింద నిర్మించిన అతిపెద్ద సొసైటీని నేడు ప్రారంభించామని తెలిపారు. 2014లో హామీ ఇచ్చానని.. ఆ వాగ్దానం నెరవేరడం, దాన్ని చూడటానికి రావడం.. ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. మరోవైపు.. ఈ ఇళ్లను చూడగానే తనకు బాల్యం గుర్తొచ్చిందని పేర్కొన్నారు. చిన్నతనంలో తనకు కూడా ఇలాంటి ఇంట్లో నివసించే…
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేసు విచారణ జరిగింది. చంద్రబాబుకు స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీం కోర్టులో సవాలు చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో విచారణ చేపట్టగా, ధర్మాసనం ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. అంతేకాకుండా.. కౌంటర్ దాఖలు చేసేందుకు బాబు తరపు న్యాయవాదులు సమయం కోరారు. దీంతో కేసును వాయిదా వేశారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో జస్టిస్ బేలా ఎం త్రివేదీ, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు…
కేశినేని నానిపై టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీవ్ర విమర్శలు చేశారు. కేశినేని నాని పార్టీ మారి ఇష్టం వచ్చినట్లు మాట్లడటం సరికాదని మండిపడ్డారు. అవినాష్ తో కలిసి తన మీద రెండుసార్లు కామెంట్ చేశారని ఆరోపించారు. టీడీపీలో ఉన్నపుడు చంద్రబాబు, లోకేష్ గురించి నాని మాట్లాడితే తాను ఖండించే వాడినని తెలిపారు. తాను సమర్థుడు కాదని కేశినేని నానీ అంటున్నారు.. సమర్థుడు అంటే పార్టీలు మారడమా అని విమర్శించారు. తాను అనేక మార్లు ఎమ్మెల్యే, ఎంపీగా మెజారిటీతో గెలిచానని.. లక్ష మెజారిటీతో 2014లో…