సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం పౌర సరఫరాల శాఖ రూపొందించిన ప్రతిపాదనల పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సివిల్ సప్లై శాఖ బడ్జెట్ ప్రిపరేషన్ పై చర్చ జరిగిందని అన్నారు. పేదవాడికి బియ్యం సప్లై చేసే శాఖ పై గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. 2014-15లో రూ.383 కోట్లు ఏరియర్స్ ఉంటే.. సంవత్సరానికి పెరుగుతూ వచ్చిందనని తెలిపారు. రూ.14వేల కోట్లు బకాయి పడిందని మంత్రి భట్టి విక్కమార్క చెప్పారు.
CID: పదేళ్ల తర్వాత తెలంగాణలో మొదటిసారి సీఐడి కేసు..
గతంలో సివిల్ సప్లై వాళ్ళు రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించే వారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కానీ.. 2016 -17 నుంచి రాష్ట్ర ప్రభుత్వం.. సివిల్ సప్లై శాఖకు ఒక్కో సంవత్సరం రూ.6 వేల కోట్లు , 8 వేల కోట్లు, 11వేల కోట్లు, 45 వేల కోట్లు, 45 వేల కోట్లు, 50 వేల కోట్లు భారం పడిందని తెలిపారు. మొత్తంగా బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్ రూ. 58, 860 కోట్లు అని భట్టి తెలిపారు. ఉన్న పాత బకాయిలు కట్టడం కోసం.. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి గత ప్రభుత్వం మళ్ళీ అప్పు తీసుకున్నారని ఆయన చెప్పారు.
Asian Vaishnavi: మొన్నటిదాకా థియేటర్ వార్.. ఇప్పుడు కలిసి ఓపెనింగ్?
దీంతో.. సివిల్ సప్లై పై భయంకరమైన భారం పడిందని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు గ్యారెంటీ ఇస్తే తప్ప.. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదని అన్నారు. కాగా.. ధనిక రాష్టాన్ని బీఆర్ఎస్ చేతుల్లో పెడితే రాష్ట్రం ఆగం అయ్యిందని దుయ్యబట్టారు. ఇంత భారం ఉన్నా.. లబ్ధిదారులకు, రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని సివిల్ సప్లై శాఖ కమిషనర్ ను మంత్రి ఆదేశించారన్నారు. కోరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం.. ఎన్ని కష్టాలు పడ్డ ఇందిరమ్మ రాజ్యం కోసం కృషి చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.