బీఆర్ఎస్ భవన్ లో సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవ రావు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. కార్యకర్తలు లేనిదే పార్టీ లేదని.. జెండా మోసిన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా.. ఉద్యమకారుల్లో ఉన్న అసంతృప్తిని గుర్తించాం.. వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుంది అని అన్నారు. కాగా.. తెలంగాణలో హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలు హీరోలు అని అన్నారు.
Read Also: Fire Accident: బంజారాహిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం.. మూడు కార్లు దగ్ధం
ఏ గాలి కూడా హైదరాబాద్ లో బీఆర్ఎస్ గెలువును అడ్డుకోలేక పోయిందని కేకే అన్నారు. బీఆర్ఎస్ లో యువతను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తాం.. ప్రతి మూడు నెలల కోసారి పార్టీ మీటింగ్ లు మండల స్థాయి నుంచి ఏర్పాటు చేసుకుందామన్నారు. పార్టీలో ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యూ వరకు అన్ని భావజాలాల వారు ఉన్నారని తెలిపారు. కాగా.. ఈ సమావేశాలు ముగిసిన తర్వాత కేసీఆర్ పార్టీ ముఖ్యులతో సమావేశం నిర్వహించి పార్టీ పునర్వ్యవస్తీకరణ పై నిర్ణయాలు ప్రకటిస్తారని కేకే చెప్పారు.
Read Also: Uttam Kumar Reddy: తెలంగాణను నాశనం చేసింది, ద్రోహం చేసింది, దోచుకుంది బీఆర్ఎస్సే..