హైదరాబాద్ బంజారాహిల్స్ లో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్ నెంబర్. 4లోని ఓ ప్రైవేట్ హోటల్ పార్కింగ్ ప్లేస్ లో ఉన్న మూడు కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనపై వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. కాగా, ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: Uttam Kumar Reddy: తెలంగాణను నాశనం చేసింది, ద్రోహం చేసింది, దోచుకుంది బీఆర్ఎస్సే..
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4. లోని సరిత రెసిడెన్సీ వద్ద అగ్నిప్రమాదం జరిగిందని 100 దయాళ్ సంచారం అందిందని జూబ్లీహిల్స్ ఫైర్ ఇన్స్పెక్టర్ సాయి తెలిపారు. వెంటనే 2 ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది, డీఆర్ఎఫ్ టీంతో ఘటన స్థలానికి చేరుకున్నామన్నారు. పార్కింగ్ ప్లేస్ లో ఉన్న ఓమినీ కార్ ఇంజన్ లో నుంచి మంటలు చెలరేగడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఆ తర్వాత పక్కనే పార్క్ చేసి ఉన్న రెండు కార్లలో మంటలు వ్యాపించాయని తెలిపారు. కాగా.. పార్కింగ్ ప్లేస్ లో తగలబడ కార్ల ద్వారా మంటలు సరిత రెసిడెన్స్ రెండవ అంతస్తు వరకు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read Also: Snoring: గట్టిగా “గురక” పెడుతున్నాడని వ్యక్తి హత్య..