ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. హౌజింగ్, రెవెన్యూ, ఐఅండ్‌పీఆర్ అధికారుల సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు ఇచ్చారు. ఈ బడ్జెట్ సమీక్ష సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించండని అధికారులకు తెలిపారు.
మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. మూడోసారి జరిగిన అగ్నిప్రమాదం లవకుష్ ధామ్ శిబిరంలో జరిగినట్లు సమాచారం. ఈ అగ్నిప్రమాదంపై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి కృషి చేశారు.
కులగణనలో వివరాలు నమోదు చేసుకోని వారికి మరో అవకాశం కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం.. రేపటి నుండి 28వ తేదీ వరకు (అంటే 12రోజుల పాటు) రీ సర్వే చేపట్టనుంది. అందుకోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కాల్ సెంటర్ 040-21111111 ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కాల్ సెంటర్ పని చేయనుంది.
జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి 2025లో భారతదేశంలో తన కొత్త బైక్ కవాసకి వెర్సిస్ 1100 ను విడుదల చేసింది. ఈ కొత్త బైక్ 1100cc విభాగంలో అందుబాటులో ఉంది. ఈ బైక్ యువతను ఎక్కువగా ఆకర్షణను కలిగిస్తోంది. శక్తివంతమైన ఇంజిన్, అధిక సామర్థ్యం, డిజైన్ లోనూ చాలా వినూత్నతలతో కవాసకి వెర్సిస్ 1100 భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది.
రామరాజ్యం వీర రాఘవరెడ్డి కేసులో సంచలన అంశాలు వెలుగు చూశాయి. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ఉన్నట్లు తేలింది. తనకు తాను శివుడి అవతారం అని క్రియేట్ చేసుకున్నాడు వీర రాఘవరెడ్డి. శివుడి అవతారం ధరించాను అంటూ రామరాజ్యంలో రిక్రూట్మెంట్ కూడా చేశాడు.
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కూతురిని ప్రేమిస్తున్నాడని ఓ వ్యక్తిని హత్య చేశాడు తండ్రి. మెగ్యానాయక్ తండాలో 9 తరగతి చదువుతున్న బాలికతో చనువుగా ఉండటంతో దశరథ్(26) పై తండ్రి కక్ష పెంచుకున్నాడు.
తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ నెం.1గా నిలిచింది. ఇంగ్లండ్‌ను క్లీన్ స్వీప్ చేయడంతో టీమిండియా 119 రేటింగ్‌లో మొదటి స్థానంలో ఉంది.
సికింద్రాబాద్లో గంజాయి కలకలం రేపుతోంది. 15 కేజీల గంజాయిని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ సీజ్ చేశారు. ఒరిస్సా నుండి సికింద్రాబాద్ మీదుగా ఉత్తర్‌ప్రదేశ్‌కు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ, పలు కీలక అంశాలపై రాహుల్ గాంధీతో చర్చించారు. భేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు.