యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా అట్టహాసంగా సాగుతోంది. పుణ్య స్నానాలు ఆచరించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులే కాదు ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాది భక్తులు తరలివస్తున్నారు. దీంతో.. ప్రయాగ్ రాజ్ జన సంద్రంగా మారుతోంది. శనివారం మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. మూడోసారి జరిగిన అగ్నిప్రమాదం లవకుష్ ధామ్ శిబిరంలో జరిగినట్లు సమాచారం. ఈ అగ్నిప్రమాదంపై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి కృషి చేశారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం ఏమీ జరగలేదు. అగ్నిప్రమాదం కారణంగా అనేక మండపాలు కాలిపోయాయి. కాగా.. ఈ ప్రమాదానికి సంబంధించి స్పష్టమైన సమాచారం లేదు.
Read Also: Kerala: చర్చి స్థలంలో బయటపడ్డ ఆలయ అవశేషాలు.. చర్చి నిర్వాహకులు ఏం చేశారంటే?
మహా కుంభమేళాలో అగ్ని ప్రమాద ఘటన జరగడం మొదటిసారి కాదు.. ఫిబ్రవరి 9న సెక్టార్-23లో గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా అగ్నిప్రమాదం సంబవించింది. దీంతో వెంటనే అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. 2025 జనవరి 30న మొదటిసారి అగ్నిప్రమాదం జరిగింది. ఛత్నాగ్ ఘాట్ వద్ద టెంట్ సిటీలో మంటలు చెలరేగి, దాదాపు పది టెంట్లు దగ్ధమయ్యాయి. మొత్తం మీద, మహా కుంభమేళా ప్రారంభం నుంచి అనేక అగ్నిప్రమాదాలు సంభవించాయి. 2025 జనవరి 19న గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్ క్యాంప్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 150కు పైగా కుటుంబాలు ప్రభావితమయ్యాయి. ఆ అగ్నిప్రమాదానికి గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణమని తెలుస్తోంది, కానీ గీతా ప్రెస్ వ్యక్తులు మాత్రం అగ్నిప్రమాదం బయటి మూలాల వల్ల జరిగిందని తెలిపారు. ఈ అగ్నిప్రమాదాలు అందరికీ చిగురుటాకులుగా మారాయి. తదుపరి చర్యల పట్ల ప్రభుత్వం మరింత జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు.
Read Also: NTR Trust Euphoria Musical Night: యుఫోరియా కన్సర్ట్’కి బాలయ్య, పవన్.. ఫ్రేమ్ అదిరిందిగా!