న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాటపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి కమిటీ వేసింది. ఉన్నత స్థాయి కమిటీలో నార్త్ రైల్వేస్ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ నర్సింగ్ దేవ్, ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ కమిషనర్ పంకజ్ గంగ్వార్‌లు ఉన్నారు. కాగా.. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ ప్రారంభించింది.
భారత మార్కెట్లో ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు మారుతి సుజుకి.. గత కొన్ని నెలల్లో పలు వాహనాల ధరలను పెంచింది. వీటిలో హ్యాచ్‌బ్యాక్ విభాగంలో బాగా పాపులర్ అయిన మారుతి వ్యాగన్ ఆర్ ధరలు కూడా పెరిగాయి. ఇది 2025 ఫిబ్రవరి నెలలో జరిగింది.
ఐపీఎల్ 2025 సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్ విడుదలైంది. సన్‌రైజర్స్ మార్చి 23న (ఆదివారం) రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్ ఉప్పల్ వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది.
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ నుంచి మంచి న్యూస్ అందింది. ఐపీఎల్ (IPL 2025) ఫుల్ షెడ్యూల్ రిలీజ్ అయింది. మార్చి 22న ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది.
శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులలో 11 మంది మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. తొక్కిసలాటలో మరణించిన ఐదుగురి పోస్ట్‌మార్టం నివేదికలు వెలువడ్డాయి. నివేదిక ప్రకారం.. ఈ ఐదుగురు "ట్రామాటిక్ అస్ఫిక్సియా" కారణంగా మరణించారని తేలింది. ఇది ఛాతీ లేదా పొత్తికడుపు పైభాగంపై అధిక ఒత్తిడి వల్ల ఆక్సిజన్ లేదా రక్త సరఫరా కోల్పోవడాన్ని సూచిస్తుంది.
పాకిస్తాన్‌లో ఇటీవల ముగిసిన ముక్కోణపు సిరీస్‌లో న్యూజిలాండ్ తమ అనుభవం లేని పేసర్లతో ఆకట్టుకుందని.. వీరి ఫామ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కూడా కొనసాగుతుందని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ టిమ్ సౌథీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ ఐపీఎల్ (IPL 2025) షెడ్యూల్ ఈరోజు రిలీజ్ కానుంది. కొన్ని రోజులుగా కొన్ని మ్యాచ్‌ల షెడ్యూల్ గురించి నివేదికలు వస్తున్నాయి. టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మార్చి 22న జరుగుతుందని.. ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి బ్లాక్‌బస్టర్ మ్యాచ్ చేపాక్ మైదానంలో జరుగనుంది.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ స్టార్ రషీద్ ఖాన్ పై పొగడతల వర్షం కురిపించాడు. పాకిస్తాన్ మాజీ స్టార్ బౌలర్ వసీం అక్రమ్ కంటే రషీద్ ఖాన్ గొప్ప క్రికెటర్ అని రషీద్ లతీఫ్ అభివర్ణించారు.
ముంబై ఇండియన్స్ తమ జట్టులో మార్పులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్ గాయం కారణంగా ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్నాడు. అయితే.. అతని స్థానంలో ముంబై ఇండియన్స్.. ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహమాన్‌ను జట్టులోకి తీసుకుంది.
ఆస్తి కోసం కొడుకు వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేశాడు. సుత్తితో కొట్టి కర్కశకంగా చంపాడు.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మోహన్‌లాల్‌గంజ్‌లో చోటు చేసుకుంది. హత్య అనంతరం యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాగా.. మృతుల చిన్న కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు.