ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. హౌజింగ్, రెవెన్యూ, ఐఅండ్‌పీఆర్ అధికారుల సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు ఇచ్చారు. ఈ బడ్జెట్ సమీక్ష సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించండని అధికారులకు తెలిపారు. మహబూబ్ నగర్ నుంచి నిర్మాణం ప్రారంభించాలన్నారు.
Read Also: Pawan Kalyan: బాలయ్య అనే పిలువు అంటారు కానీ ఎపుడూ సార్ అనే పిలివాలి అనిపిస్తుంది!
ప్రభుత్వ భూముల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టండని భట్టి విక్రమార్క అధికారులను కోరారు. ప్రభుత్వ పథకాలను షార్ట్ ఫిల్మ్ ద్వారా ప్రచారం చేయాలని తెలిపారు. అలాగే.. శాటిలైట్ టౌన్ షిప్ నిర్మాణాలపై హౌజింగ్ శాఖ దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఎల్ఐజి, ఎంఐజి, హెచ్ఐజి ఇండ్ల నిర్మాణంతో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారం అవుతుందని వెల్లడించారు. డిజిటల్ భూ సర్వేకు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి.. ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు.
Read Also: Elon Musk: తన కొడుకుకు ఇండియన్ సైంటిస్ట్ పేరు పెట్టిన ఎలాన్ మాస్క్.. ఇంతకీ ఎవరతను?