కులగణనలో వివరాలు నమోదు చేసుకోని వారికి మరో అవకాశం కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం.. రేపటి నుండి 28వ తేదీ వరకు (అంటే 12రోజుల పాటు) రీ సర్వే చేపట్టనుంది. అందుకోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కాల్ సెంటర్ 040-21111111 ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కాల్ సెంటర్ పని చేయనుంది. ఇప్పటి వరకు కుల గణనలో నమోదు కాని కుటుంబ సభ్యులు మాత్రమే కాల్ సెంటర్‌కు కాల్ చేసి వారి పూర్తి వివరాలు ఇవ్వాలి. ఆధార్ నంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్‌తో పాటుగా పోస్టల్ పిన్ కోడ్ నెంబర్ ను తెలియజేయాల్సి ఉంటుంది. కాల్ చేసిన వాళ్ళు ఇచ్చే అడ్రస్ ప్రకారం వారి ఇంటికి వెళ్లి ఎన్యుమరేటర్లు కులగణన చేయనున్నారు. మొబైల్ నెంబర్‌తో సెర్చ్ చేసి సంబంధిత వ్యక్తి పాత డేటా బేస్‌లో నమోదు అయ్యారా లేదా అనే వివరాలు అధికారులు పరిశీలించనున్నారు. జీహెచ్ఎంసీతో పాటు ఇతర జిల్లాల నుండి వచ్చిన కాల్స్ కూడా స్వీకరించి.. ఆ వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఫార్వర్డ్ చేయనున్నారు అధికారులు.
Kawasaki: బైకు ప్రియులను ఆకర్షిస్తున్న కవాసకి వెర్సిస్ 1100.. అద్భుత ఫీచర్లతో లాంచ్
కాగా.. గతేడాది నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు ప్రభుత్వం మొదటిసారి కులగణన సర్వే నిర్వహించింది. దాదాపు 50 రోజుల పాటు ప్రజల వివరాలను సేకరించారు. అనంతరం ఓ నివేదికను ప్లానింగ్ కమిషన్ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందించారు. అనంతరం ప్లానింగ్ కమిషన్ నివేదికు ఆమోదం తెలిపిన సబ్ కమిటీ, కేబినెట్ కు పంపింది. ఆ తర్వాత కేబినెట్ ఆమోదం తెలపగా.. అనంతరం తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి.. అసెంబ్లీలో కులగణన నివేదికను ప్రవేశపెట్టారు. సభలో దీనిపై చర్చించారు.
Off The Record: టీడీపీ హిట్ లిస్ట్‌లో ఉన్నది వాళ్లేనా..!? అరెస్టులు తప్పవా..?
ఈ నివేదిక ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో జనాభా 3,54,77,554 గా ఉందని.. ఇందులో మొత్తం కుటుంబాలు 1,12,15,134 ఉన్నాయని తెలిపారు. ఇందులో బీసీల జనాభా మంది ఉన్నారని ఇది మొత్తం జనాభాలో 46.25 శాతం ఉందన్నారు. అలాగే ఎస్సీలు 61,84,319 మంది.. ఈ సంఖ్య మొత్తం జనాభాలో 17.43 శాతం, ఎస్టీలు 37,05,929 మంది.. మొత్తం జనాభాలో 10.45 శాతం ఉంటుంది. ముస్లింలను రెండు వర్గాలుగా విభజించారని అందులో బీసీ ముస్లింలు 35,76,588 ఉండగా.. 10.85 శాతం, ఓసీ ముస్లింలు 8,80,424 మంది ఉండగా.. 2.48 శాతం అని.. మొత్తం ముస్లిం జనాభా తెలంగాణలో 12.56% శాతంకు చేరుకున్నట్లు తెలిపారు. అలాగే ఓసీల జనాభా శాతం 15.79 శాతం ఉన్నారు. ఈ కుల గణన సర్వేలో 56 ప్రధాన, 19 అనుబంధ ప్రశ్నలు కలిపి మొత్తం 75 ప్రశ్నలు ఉన్నాయి. కాగా.. కులగణన సర్వే చేసేందుకు వివిధ స్థాయిలో ఉన్న టీచర్లుగా ఉన్న వారితో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగుకు ఎన్యుమరేటర్లను ప్రభుత్వం నియమించింది.