రాష్ట్ర బడ్జెట్ కూర్పుపై ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది ఏపీ సర్కార్.
అహ్మదాబాద్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది.
కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణలో భాగంగా కేరళ సీబీఐ అధికారులు కాకినాడకు వచ్చారు. 2023 నవంబర్ 25వ తేదీన సామర్లకోటలో ట్రైన్ నుంచి పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కాగా.. ఆ మృతదేహం ఎవరిదని అధికారులు ఆరా తీశారు. అయితే.. మృతదేహం కోసం ఎవరు రాకపోవడంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.
దక్షిణ భారతదేశ ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న శ్రీ ఆగస్త్య మహర్షి ఆలయం, అగస్త్య ఆశ్రమం సందర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ వ్యవహారంపై ఏర్పాటు అయిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న వాళ్ళని అరెస్టు చేయడం కేసు దర్యాప్తులో భాగం.. సంతోషించదగిన విషయం అని అన్నారు. భవిష్యత్తులో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
ఈనెల 23న జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC ) హాల్ టికెట్లు విడుదల చేసింది. psc.ap.gov.in. సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని ఏపీపీఎస్సీ తెలిపింది.
తిరుపతి తొక్కిసలాటపై సీబీఐ విచారణకు ఆదేశించాలని దాఖలైన పిల్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ సంఘటనపై ఇప్పటికే ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించిందని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు.
ప్రముఖ మోటివేషనల్ ట్రైనర్, ఐఏఎస్ ట్రైనర్ ఆకెళ్ళ రాఘవేంద్ర రావు ఆధ్వర్యంలో సింధు మేధో మథనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రముఖ సిద్ధ వైద్యురాలు, ఆధ్యాత్మికవేత్త, డాక్టర్ సత్య సింధూజ తెలిపారు. దాదాపు 100 ఎపిసోడ్‌ల వరకు నడిచే ఈ కార్యక్రమంలో సత్య సింధూజ తన అనుభవాన్ని, తన విశ్లేషణను ప్రేక్షకులతో పంచుకున్నారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై 4 వేల రన్స్ పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు.
ఆరోగ్యంగా ఉండటం అంటే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మాత్రమే కాదు. మన నోటి ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమైనది. మన నోటి ఆరోగ్యం పర్యవేక్షించడం ద్వారా మనం వివిధ ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. అయితే నోటి ఆరోగ్యానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మొత్తం శరీరానికి లాభం కలుగుతుంది. శరీరంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అది నోటి ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.