BYD సీలియన్ 7 ఎలక్ట్రిక్ SUV భారత మార్కెట్లో లాంచ్ చేశారు. 2025 ఫిబ్రవరి 17న BYD భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ SUV, సెడాన్ కార్లను విడుదల చేసింది. ఈ కారును భారత్ మొబిలిటీ 2025 నిర్వహించిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. కాగా.. 2025 జనవరి18 నుండే ఈ వాహనానికి బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.
సౌతాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ జేపీ డుమినీ (Jean Paul Duminy) విడాకులు తీసుకున్నాడు. 14 సంవత్సరాల సంసార సంబంధం తెగిపోయి విడాకుల వరకు చేరాడు. ఈ విషయాన్ని అతను తన ఇన్‌స్టా అకౌంట్ లో పోస్ట్ చేశాడు.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట తర్వాత భారతీయ రైల్వే కీలకమైన చర్యలు తీసుకోనుంది. దేశవ్యాప్తంగా 60 రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో శాశ్వత హోల్డింగ్ జోన్‌లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్ మధురానగర్‌లో ఓ ప్రియుడు ప్రియురాలి ఇంటి ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. శనివారం రాత్రి ప్రియుడు సూర్యనారాయణ ప్రియురాలి ఇంటికి వచ్చాడు. ఆమె భర్త ముందే 'నీ పెళ్లాంని నాకిచ్చేయ్.. బాగా చూసుకుంటాను' అని అన్నాడు. దీంతో.. ప్రియురాలి భర్త, సూర్యనారాయణకు మధ్య గొడవ జరిగింది.
ఆన్‌లైన్‌లో గేమ్స్ ద్వారా పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి మాయమాటలతో మోసపోయింది. ఆ బాలికను లొంగదీసుకుని ఆన్‌లైన్‌లో చాటింగ్‌లో స్వీట్ మెస్సేజ్‌లతో ఆమెను ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా.. ఆమె ఫోటోలను తనకు షేర్ చేయాలని కోరాడు. దీంతో ఆ బాలిక తన ఫోటోలను ఆ వ్యక్తికి పంపించింది. ఆమె పంపించిన స్నాప్‌చాట్‌లో న్యూడ్ ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. దీంతో.. తల్లిదండ్రులతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బాలికను బ్లాక్‌మెయిల్ చేశాడు యువకుడు ఖష్‌దేవ్.
న్‌లైన్ గేమ్స్‌కు బానిసై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడి అరవింద్ (23) అనే వ్యక్తి లక్షలు పోగొట్టుకున్నాడు. యువకుడు అరవింద్ డిగ్రీ చదువుతున్నాడు.
ఇండియాలో చాలా మంది హీరో బైకులను నడపడానికి ఇష్టపడతారు. జనవరి 2025లో బైకులు మంచి ప్రగతిని కనబరచాయి. గత నెలలో మొత్తం 6,28,536 యూనిట్ల అమ్మకాలు నమోదు అయ్యాయి. వీటిలో టాప్-5 బైక్‌లు ప్రత్యేక స్థానాలు సాధించాయి. అందులో హీరో స్ప్లెండర్ భారతదేశంలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా శనివారం సాయంత్రం దుబాయ్ చేరుకుంది. ఆదివారం భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ ప్రారంభించి.. ఐసీసీ అకాడమీలో తమ శిక్షణను కొనసాగించింది. అయితే ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డాడు. ఆదివారం ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రిషబ్ పంత్ ఎడమ మోకాలికి గాయమైంది.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నటి కిమ్ సే రాన్ (24) మృతి చెందారు. ఆమె మరణం వార్త విన్న అభిమానులు, ప్రముఖులు, చిత్ర పరిశ్రమ సభ్యులు, దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ద్రిగ్భాంతికి గురవుతున్నారు. కాగా.. ఈరోజు కిమ్ సే రాన్ తన ఇంట్లో శవమై కనిపించింది.