తాను ప్రేమించిన అమ్మాయి కుటుంబీకుల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఖలందర్ నగర్‌లో చోటు చేసుకుంది.
స్థానిక సంస్థల ఎన్నికలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ శిత్తశుద్ధితో లేకపోతే ఇబ్బందులు తప్పవని కాంగ్రెస్‌కు చురకలు అంటించారు. ఢిల్లీలో ఆప్‌కు, కాంగ్రెస్‌కు అదే ఎదురైందని అన్నారు.
ఖమ్మం జిల్లాలో పేరుకే ముగ్గురు మంత్రులు, అభివృద్ధిలో మాత్రం శూన్యమని ఎమ్మెల్సీ కవిత దుయ్యబట్టారు. అభివృద్ధి చేయలేని ముగ్గురు మంత్రులు రాజీనామా చేయాలని మండిపడ్డారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రాహుల్ గాంధీతో చర్చిస్తున్నారు. మరోవైపు.. నిన్న తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీని ఏఐసీసీ మార్చింది. కొత్త ఇంఛార్జ్ నియామకం నేపథ్యంలో రాహుల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీకి ప్రాధాన్యత నెలకొంది.
నిజామాబాద్ మార్కెట్ యార్డులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్ పై కార్మికులు దాడికి పాల్పడ్డారు. పోలీస్ వాహనాన్ని అడ్డుకుని మరి కార్మికులు దాడి చేశారు. పసుపు దొంగతనం ఆరోపణలు నిరసిస్తూ పసుపు కాంటాలు నిలిపివేసి కార్మికులు ఆందోళన చేపట్టారు.
బర్డ్ ప్లూ గోదావరి జిల్లాలను వణికిస్తోంది. బర్డ్ ఫ్లూ పేరు చెప్తేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. కోళ్లకు సోకిన ఈ వైరస్.. కొన్ని రోజుల్లోనే లక్షలాది కోళ్లను బలి తీసుకుంది. ఈ కోళ్లను పరీక్షించిన భూపాల్‌లోని హై సెక్యూరిటీ ల్యాబ్ రిపోర్ట్ సైతం.. దీనిని బర్డ్ ఫ్లూ వైరస్‌గా నిర్ధారించింది. ఈ వైరస్ కోళ్ల నుండి మనుషులకు కూడా సంక్రమించే అవకాశం ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది.
బర్డ్ ఫ్లూపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కోళ్ల మృతికి గల కారణాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.
రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు మూడు మ్యాచ్‌ల వన్డేల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను వైట్‌వాష్ చేసింది. బుధవారం జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ ఇంగ్లాండ్‌ను 142 పరుగుల తేడాతో ఓడించింది. 357 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లండ్.. 34.2 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌట్ అయింది.
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో జరిగింది. బ్యాంక్ లోన్ కట్టలేదని బ్యాంకు పనులను వదిలిపెట్టుకుని మరీ.. రైతు ఇంటికి వచ్చి గేటును జప్తు చేసి తీసుకుపోయారు డీసీసీబీ బ్యాంక్ అధికారులు.
వైసీపీపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై కుట్రతో కొందరు అన్ని కార్యక్రమాల పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.