సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కూతురిని ప్రేమిస్తున్నాడని ఓ వ్యక్తిని హత్య చేశాడు తండ్రి. మెగ్యానాయక్ తండాలో 9 తరగతి చదువుతున్న బాలికతో చనువుగా ఉండటంతో దశరథ్(26) పై తండ్రి కక్ష పెంచుకున్నాడు. దీంతో.. తట్టుకోలేక ఆ వ్యక్తిని హత్య చేశాడు. నిజాంపేట మండల శివారు అటవీ ప్రాంతంలో యువకుడి మృతదేహాన్ని తగలబెట్టినట్టు సమాచారం.. అయితే.. దశరథ్‌ను చంపిన అనంతరం నిందితుడు గోపాల్ నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.
Read Also: Team India: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బూస్ట్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1
మరోవైపు.. దశరథ్ కోసం కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. వ్యక్తి మృతదేహం కోసం రోడ్డుపై బైఠాయించారు. కాగా.. దశరథ్ నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతుడు దశరథ్‌కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భర్త కనిపించడం లేదంటూ దశరథ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Read Also: Chandoo Mondeti: అల్లు అర్జున్ సిగ్నేచర్ కోసం ‘తండేల్’ కథ..గుండెల్లో గునపంతో పొడిచినట్లనిపించింది!