జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి 2025లో భారతదేశంలో తన కొత్త బైక్ కవాసకి వెర్సిస్ 1100 ను విడుదల చేసింది. ఈ కొత్త బైక్ 1100cc విభాగంలో అందుబాటులో ఉంది. ఈ బైక్ యువతను ఎక్కువగా ఆకర్షణను కలిగిస్తోంది. శక్తివంతమైన ఇంజిన్, అధిక సామర్థ్యం, డిజైన్ లోనూ చాలా వినూత్నతలతో కవాసకి వెర్సిస్ 1100 భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇందులో ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం..
Read Also: Jayalalitha’s Assets: వామ్మో.. జయలలిత ఆభరణాల విలువ రూ.4వేల కోట్లు.. 1,672 ఎకరాల భూమి..
శక్తివంతమైన ఇంజిన్:
కవాసకి వెర్సిస్ 1100లో 1100cc సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్, ఫోర్ స్ట్రోక్, ఇన్-లైన్ ఫోర్, 16 వాల్వ్ ఇంజిన్ అందించారు. ఈ ఇంజిన్ శక్తి పరంగా 99 కిలోవాట్ల శక్తిని, 112 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తివంతమైన ఇంజిన్‌ను 6 స్పీడ్ రిటర్న్ షిఫ్ట్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌తో కలిపి, బైక్ చాలా రన్నబుల్ మరియు రెస్పాన్సివ్‌గా మారుతుంది.
ఫీచర్లు:
కవాసకి వెర్సిస్ 1100లో అనేక అత్యాధునిక, వినూత్న ఫీచర్లు ఉన్నాయి. ఇవి బైక్‌ని మరింత ఆకర్షణీయంగా, ఉపయోగకరంగా మార్చాయి. LED లైట్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్పోర్టీ డిజైన్, అద్భుతమైన విండ్ ప్రొటెక్షన్, 21 లీటర్ పెట్రోల్ ట్యాంక్, స్ప్లిట్ సీట్లు, నిటారుగా రైడింగ్ పొజిషన్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, KCMF, IMU, అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్, ABS వంటి అత్యాధునిక ఫీచర్లు కలిగి ఉంది.
ధర:
2025 కవాసకి వెర్సిస్ 1100 బైక్ భారతదేశంలో రూ.12.90 లక్షల ఎక్స్-షోరూమ్ ఉంది. ఈ బైక్ మెటాలిక్ డయాబ్లో బ్లాక్, మెటాలిక్ మ్యాట్ గ్రాఫేన్ స్టీల్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంటాయి. ఈ బైక్ భారతదేశంలో సూపర్ బైక్ విభాగంలో పోటీకి దిగింది. BMW M 1000XR, డుకాటీ మల్టీస్ట్రాడా V4, హార్లే డేవిడ్సన్ పాన్ అమెరికా 1250 వంటి బైకులు ఈ బైకుతో పోటీ పడుతున్నాయి.