తెలంగాణలోని జనగామ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన చిన్ననాటి స్నేహితురాలు కలలోకి వచ్చి తన దగ్గరికి రమ్మంటుందని మృతురాలు తన సోదరుడికి చెప్పి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. 3 సంవత్సరాల క్రితం మరణించిన స్నేహితుడు కలలోకి వస్తున్నాడని భయపడుకుంటూ చెప్పి.. ఆ తర్వాత ఫోన్ కట్ చేసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిల్షాపురం గ్రామంలో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లాలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. బారాదరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సురేష్ శర్మ నగర్‌లో పదేళ్ల క్రితం జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసులో జడ్జి కీలక తీర్పు ఇచ్చారు. ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ తల్లి, సోదరుడు, కోడలును హత్య చేసిన ఛాయ్‌మార్ గ్యాంగ్‌లోని ఇద్దరు మహిళలతో సహా ఎనిమిది మంది దుర్మార్గులకు మరణశిక్ష విధించారు. అంతేకాకుండా.. దుండగులు దోచుకున్న బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేసిన బంగారం వ్యాపారి జీవిత ఖైదు విధించారు. ఈ నిర్ణయంతో…
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ సందర్భంగా.. ఈరోజు మ్యాచ్కు ముందు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అశ్విన్‌కు 100వ టెస్టు క్యాప్‌ను అందజేశాడు. అశ్విన్ తన 100 టెస్ట్ సందర్భంగా.. భార్య ప్రీతి నారాయణ్, తన ఇద్దరు కూతుళ్లు ధర్మశాలకు వచ్చారు. క్యాప్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు అశ్విన్‌కు తోటి ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. భారత ఆటగాళ్లు ఇరువైపు నిలుచుని చప్పట్లతో అశ్విన్‌ను మైదానంలోకి ఆహ్వానించారు.
జీతం ఎక్కువస్తుందనకుంటే ఎన్నో కంపెనీలు మారుతాం. ఎందుకంటే పైసల కోసమే కదా బ్రతికేది. కొందరు ఎక్కువగా డబ్బులు వస్తాయని విదేశాలకు కూడా వెళ్లి సంపాదిస్తారు. ఐతే ఇక్కడ ఏడాదికి జీతం కోటికి పైగా ఇస్తారంట. ఇంతకీ ఎక్కడనుకుంటున్నారా.. ఇండియాలో అయితే కాదు, స్కాట్లాండ్ లో.. స్కాట్లాండ్ పరిధిలోని కొన్ని చిన్న దీవుల్లో వైద్యుల కొరత, టీచర్ల కొరత ఉంది. అందుకోసమని అక్కడి ప్రభుత్వం.. ఓ ప్రకటన చేసింది. ఇక్కడ పనిచేసేందుకు ఉత్సాహవంతులైన వారు కావాలని.. డాక్టర్లకు ఏడాదికి రూ.1.57 కోట్లు, టీచర్లకు రూ.71.47 లక్షలు…
ఇంటిని ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటామో.. బాత్రూమ్‌ను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే.. అనారోగ్యాల బారిన పడుతాం. బాత్రూమ్‌ను శుభ్రంగా ఉంచుకోవడం కోసం, వాసన రాకుండా ఉండేందు కోసం ఎక్కువగా యాసిడ్‌ను వాడుతుంటారు. ఇది ఆరోగ్యానికి, బాత్రూమ్ రెండింటికీ మంచిది కాదు. బాత్రూమ్‌ను శుభ్రంగా ఉంచడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించిన తర్వాత బాత్రూంలో పసుపు కలర్, దుర్వాసన ఉండవు. ముఖ్యమైన విషయం ఏమిటంటే వీటితో బాత్రూమ్ శుభ్రం చేయడం చాలా సులభం.
ఉత్తరప్రదేశ్లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. జౌన్‌పూర్‌లోని సిక్రారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బోధాపూర్ గ్రామంలో గురువారం బీజేపీ జిల్లా మంత్రి ప్రమోద్ కుమార్ యాదవ్‌ను దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో తొలి రోజు ముగిసింది. ఈ మ్యాచ్ లో తొలిరోజు టీమిండియా ఆట ముగిసే సమయానికి 30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ (52), శుభ్‌మన్ గిల్ (26) పరుగులతో ఉన్నారు. కాగా.. యశస్వి జైస్వాల్ 58 బంతుల్లో 57 పరుగులు చేసి పెవిలియన్‌కు బాటపట్టాడు. షోయబ్ బషీర్ బౌలింగ్ లో ఔటయ్యాడు.
2018లో జరిగిన అంకిత్ సక్సేనా హత్య కేసులో తీస్ హజారీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించిన ముగ్గురు దోషులకు తీస్ హజారీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మహ్మద్ సలీం, అక్బర్ అలీ, అతని భార్య షహనాజ్ బేగంలకు కోర్టు శిక్ష విధించింది. దీంతో పాటు ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి రూ.50,000 జరిమానా కూడా విధించింది. ఈ కేసుపై తీర్పును వెలువరిస్తూ.. దోషుల వయస్సు, నేర చరిత్రను పరిగణనలోకి తీసుకుని వారికి మరణశిక్ష విధించడం లేదని కోర్టు పేర్కొంది.…
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రికార్డ్ సృష్టించాడు. రన్ మిషన్, కింగ్ కోహ్లి పేరిట ఉన్న ఓ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ కోహ్లీ పేరిట ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును యశస్వి బద్దలు కొట్టాడు. ఇంతకుముందు కోహ్లి 2016-17లో భారత్ లో జరిగిన నాలుగు మ్యాచ్ల సిరీస్లో 8 ఇన్నింగ్స్ ల్లో 109.2 రన్స్ చేశాడు. తాజాగా.. ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఆ రికార్డ్ ను బ్రేక్…
చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ను రష్యా ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు వ్లాదిమిర్ పుతిన్ సర్కార్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. కాస్పరోవ్ పుతిన్ సర్కార్ పై బహిరంగంగా తీవ్ర విమర్శలు చేశాడు. అందు కారణంగా ఆయన్ను 'ఉగ్రవాదులు, తీవ్రవాదులు' జాబితాలో చేర్చినట్లు రష్యా మీడియా తెలిపింది.