ఇంటిని ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటామో.. బాత్రూమ్‌ను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే.. అనారోగ్యాల బారిన పడుతాం. బాత్రూమ్‌ను శుభ్రంగా ఉంచుకోవడం కోసం, వాసన రాకుండా ఉండేందు కోసం ఎక్కువగా యాసిడ్‌ను వాడుతుంటారు. ఇది ఆరోగ్యానికి, బాత్రూమ్ రెండింటికీ మంచిది కాదు. బాత్రూమ్‌ను శుభ్రంగా ఉంచడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించిన తర్వాత బాత్రూంలో పసుపు కలర్, దుర్వాసన ఉండవు. ముఖ్యమైన విషయం ఏమిటంటే వీటితో బాత్రూమ్ శుభ్రం చేయడం చాలా సులభం.
Read Also: MP Vijay Sai Reddy: ఏపీ అభివృద్ధిలో వెనుక పడిందని చేస్తున్న ప్రచారంలో నిజం లేదు..
రఫ్ క్లీనర్
యాసిడ్ బదులు బాత్రూమ్ క్లీనింగ్ కోసం తయారు చేసిన రఫ్ క్లీనర్ వాడాలి. ఇది ఆరోగ్యానికి కూడా హానికరం కాదు. దాదాపు రూ.150కి లభించే ఈ క్లీనర్‌ను ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. దీన్ని నీటిలో కలిపి బాత్‌రూమ్ మొత్తం స్ప్రే చేసి పదిహేను నిమిషాల తర్వాత గుడ్డతో తుడవాలి.
వైపర్
బాత్‌రూమ్‌లో వైపర్‌ని ఉంచాలి. దీంతో.. నీటిని తుడిచివేస్తూ బాత్రూమ్‌ను ఎల్లప్పుడూ పొడిగా ఉంచాలి. ఇలా బాత్‌రూమ్ శుభ్రంగా ఉండడమే కాకుండా హానికరమైన బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది.
వెనిగర్
కుళాయిలు, ఇతర ఫిట్టింగ్‌లను శుభ్రం చేయడానికి వైట్ వెనిగర్ ఉపయోగించాలి. వారానికి ఒకసారి వైట్ వెనిగర్ తో ఫిట్టింగ్స్ శుభ్రం చేయడం వల్ల మరకలు పడకుండా ఉంటాయి.
ఫ్రెషనర్ వాడకం
బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్, రూమ్ ఫ్రెషనర్ ఉపయోగించడం ముఖ్యం. ఇవి బాత్రూమ్ దుర్వాసన లేకుండా ఉంచడంలో సహాయపడుతుంది. బాత్రూమ్ వాడుతున్నప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ నడవడం వల్ల బాత్రూమ్‌లో ఎలాంటి దుర్వాసన రాదు.
వంట సోడా
బాత్రూమ్ ఫ్లోర్ శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా, నీటి ద్రావణాన్ని ఉపయోగించాలి. దీంతో.. టైల్స్, సింక్‌లను శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది.
నిమ్మ
నిమ్మరసంలో క్లీనింగ్ ఏజెంట్లు ఉంటాయి. ఇది బాత్రూమ్ లో పడిఉన్న సబ్బు, షాంపూ మరకలు సులభంగా శుభ్రం చేస్తుంది.