తెలంగాణలోని జనగామ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన చిన్ననాటి స్నేహితురాలు కలలోకి వచ్చి తన దగ్గరికి రమ్మంటుందని మృతురాలు తన సోదరుడికి చెప్పి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. 3 సంవత్సరాల క్రితం మరణించిన స్నేహితుడు కలలోకి వస్తున్నాడని భయపడుకుంటూ చెప్పి.. ఆ తర్వాత ఫోన్ కట్ చేసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిల్షాపురం గ్రామంలో చోటుచేసుకుంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. వివాహిత మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతురాలికి 15 ఏళ్ల క్రితం వివాహమైంది. ఖిలాషాపురం గ్రామానికి చెందిన యామంకి సుధాకర్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఆ దంపతులకు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. వీరంతా అన్యోన్యంగా జీవించేవారు.
Grandhi Srinivas: పవన్ కళ్యాణ్ను చంద్రబాబు బుట్టలో వేసుకున్నాడు
బుధవారం రాధిక తన అన్న శ్రీనివాస్‌కు ఫోన్ చేసింది. 3 సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకున్న తన చిన్ననాటి స్నేహితురాలు కలలోకి వచ్చి తన దగ్గరికి రావాలంటుందని తన సోదరుడికి ఫోన్‌లో చెప్పింది. ఇది విన్న రాధిక సోదరుడు ఆమెకు చాలా ధైర్యం చెప్పాడు. అయితే, ఆమె మాత్రం భయపడుతూనే ఉంది. రాధిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మృతురాలి అన్నయ్య, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.
రాధిక, తన స్నేహితురాలు చిన్ననాటి నుంచి మంచి ఫ్రెండ్స్. వివాహం కాగానే, ఓ స్నేహితురాలు వేరే ఊరిలో స్థిరపడింది. వారు ఇరువురూ తమ స్వగ్రామానికి వచ్చినప్పుడు కలుసుకునేవారు. ఒకరి కష్టసుఖాలు మరొకరు పంచుకునేవారు. అయితే, ప్రమాదవశాత్తు ఊహించని విధంగా రాధిక స్నేహితురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న రాధిక.. ఎప్పటికీ తలుచుకుంటూ బాధపడేది. తన స్నేహితురాలు కలలోకి వచ్చి తన దగ్గరకి రావాలని చెబుతోందని వాపోయింది. ఈ క్రమంలోనే రాధిక ఆత్మహత్యకు పాల్పడింది.