మెట్రోకు సంబంధించిన అనేక రకాలైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని నవ్విస్తే.. కొన్ని ఏడిపించేవి కూడా ఉంటాయి. ఇంకొన్నేమో ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇటీవల.. బెంగళూరు మెట్రోలో జరిగిన ఓ వీడియో వైరల్ అయ్యింది. ఓ రైతు మురికి బట్టలు ధరించాడని మెట్రో ఎక్కకుండా ఆపారు. తర్వాత దీనిపై పెద్ద దుమారమే రేగింది. అదేవిధంగా.. ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వీడియోలు కూడా తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలో కొంతమంది పాడుతూ, మరికొంత మంది డ్యాన్స్ చేస్తూ…
తమిళనాడులో శ్రీలంకకు తరలిస్తున్న రూ.108 కోట్ల డ్రగ్స్ ను డీఆర్ఐ, ఇండియన్ కోస్ట్ గార్డ్ లు సీజ్ చేశారు. మండపం తీరంలో ఓ కంట్రీ బోటు నుంచి అక్రమంగా తరలిస్తున్న 99 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఓ అధికారి వెల్లడించారు. డ్రగ్స్ తో వెళ్తున్న పడవ శ్రీలంక వైపు వెళుతుండగా.. పక్కా సమాచారంతో అధికారులు బోటును వెంబడించి పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు సహా నలుగురిని డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు.
భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్ లో ఐదో మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు ఎంతో ప్రత్యేకం. తన వందో టెస్టుపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రయాణం తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చాడు. గమ్యం కంటే ఎక్కువ అని అశ్విన్ అన్నాడు.
మల్లె పూవు వాసన అంటే అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా మహిళలకు జడలో మల్లెపూలు పెట్టుకోవడమంటే చాలా ఇష్టం. అయితే మల్లెలను దేవుడి కోసం కాకుండా.. జడలో పెట్టుకోవడానికి కాకుండా.. ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వాడవచ్చు. వాటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే మల్లెపూలతో చేసిన టీని రోజూ తాగితే.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. జాస్మిన్ టీని మల్లెపూలతో తయారు చేయరు.. కానీ ఇది మల్లె పువ్వుల సువాసనతో ఉంటుంది. తేయాకునీ, మల్లెపూలను ప్రత్యేక పద్ధతుల్లో…
జార్ఖండ్‌లోని దుమ్కాలో సామూహిక అత్యాచారానికి గురైన స్పానిష్ మహిళ మంచి మనసు చాటుకుంది. భారత ప్రజలపై తనకు ఎలాంటి ఫిర్యాదులు లేవని తెలిపింది. భారతదేశ ప్రజలు చాలా మంచి వారని స్పానిష్ పర్యాటకురాలు చెప్పారు. తాను నేరస్తులను తప్ప ఇక్కడి ప్రజలను నిందించను.. ఇక్కడి ప్రజలు తనను చాలా బాగా ఆదరించారని పేర్కొంది. వారు తన పట్ల దయతో ఉండటం వల్లనే.. భారత్ లో దాదాపు 20 వేల కిలోమీటర్లు సురక్షితంగా ప్రయాణించగలిగానని చెప్పింది. ఇదిలా ఉంటే.. స్పానిష్ మహిళ గ్యాంగ్ రేప్ కేసులో…
భారత కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ అభిమానులకు ఇదొక శుభవార్త. డిసెంబర్ 2022లో కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్.. తొందరగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)లో పంత్ కోలుకుంటున్నాడు. ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. అయితే.. తను ఇటీవల వీధిలో పిల్లలతో కలిసి గోళీలు ఆడుతూ కనిపించాడు. పిల్లలతో కలిసి కింద కూర్చుంటూ గోళీలాట ఆడాడు. వారిలో కలిసి పోయి సీరియస్‍గా గోళీలకు గురి పెడుతూ ఆట కొనసాగించాడు. పిల్లలతో పోటీ పడుతూ ఆటలో లెక్కలు కూడా కట్టాడు రిషబ్…
ప్రపంచంలో ఉండే మనుషులు వింత వింత రకాల అలర్జీలతో బాధపడుతున్నారు. కొంతమందికి దుమ్ము అలర్జీ, స్మెల్ అలర్జీ.. ఇలా రకరకాల అలర్జీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే నీటి అలర్జీతో బాధపడటం మీరెప్పుడైనా విన్నారా.. ?. అమెరికాలోని సౌత్ కరోలినాకు చెందిన ఓ యువతి అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆ యువతి తలస్నానం చేస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందని చెబుతోంది. భరించలేని నొప్పితో పాటు శరీరంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయని తెలుపుతుంది.
చాలా మందిలో పాదాలు విపరీతంగా పొడిబారడం లేదా మడమలలో పగుళ్లు సమస్య ఉంటుంది. దీంతో.. పొడిబారిన చర్మంతో ఎక్కువసేపు పని చేయడం, నేలపై చెప్పులు లేకుండా నడవడం, ఊబకాయం వంటి సమస్యలు ఏర్పడుతాయి. మీ పాదాల పగుళ్ళను నివారించడానికి అనేక హోం రెమడీస్ ను మీరు ఉపయోగించి ఉండవచ్చు. అయితే.. ఈ హోం రెమెడీస్ ను ఎంత ఉపయోగించినా, మీరు నేచురల్ ఆయిల్స్ ను ఉపయోగించడం వల్ల మరింత ఉత్తమ ఫలితం లభిస్తుందంటారు. పాదాలు పగుళ్ళను నివారించి పాదాలను తేమగా ఉంచుకోవచ్చు. ఇంతకీ అవెంటో…
విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ మరియు జనసేన ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. నున్న గ్రామంలో నూతనంగా టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. గన్నవరం నియోజకవర్గంలో అధికార ప్రభుత్వ నాయకులు తెలుగు భాషను కు.ని చేసి బూతులు మాట్లాడం బాధాకరం అన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఉద్యోగ కల్పనా కల్పించక పోగా యువతను తప్పు దారిలో నడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే…
మనిషికి గుండె చాలా ముఖ్యమైనది. రక్తాన్ని పంపిణీ చేసే కీలకమైన వ్యవస్ధ గుండె. నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటుంది. అలాంటి ముఖ్యమైన గుండె అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. ఈ రోజుల్లో చిన్న పెద్దా అని తేడా లేకుండా.. గుండె సమస్యలు వస్తున్నాయి. దానికి కారణం.. తినే ఆహారం, జీవనశైలి. అయితే ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..?