అర్జున చెట్టు(తెల్ల మద్ది) నుంచి వచ్చేదే అర్జున బెరడు. ఈ బెరడు తెలుపు, ఎరుపు రంగులను కలగలసి ఉంటుంది. పూర్వ కాలం నుంచి ఆయుర్వేద వైద్యంలో ఎన్నో జబ్బులకు నివారణిగా అర్జున బెరడును వినియోగిస్తున్నారు. ఈ బెరడులో ఎన్నో పోషక విలువలు నిండి ఉంటాయి. ముఖ్యంగా పోషకాలు, ఫైటోకెమికల్స్‌లో సమృద్ధిగా ఉంటాయి. అర్జున బెరడులో ఫ్లేవనాయిడ్స్, టానిన్లు, ట్రైటెర్పెనాయిడ్స్, సపోనిన్లు వంటి ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా.. అర్జునోలిక్ యాసిడ్, గల్లిక్ యాసిడ్, ఎలాజిక్ యాసిడ్, β-సిటోస్టెరాల్ వంటి అనేక ముఖ్యమైన సమ్మేళనాలు ఉన్నాయి.…
ఇండియాలో క్రికెట్ అంటే ఇష్టపడని వారుండరు. ఒక్క మ్యాచ్ ను విడిచిపెట్టకుండా చూసే అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా.. క్రికెట్ ఆడే యువత కూడా చాలా మందే ఉన్నారు. సెలవులు వచ్చాయంటే చాలు బాల్, బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లో వాలిపోతారు. అంతేకాకుండా.. పార్కుల్లో, గల్లీల్లో కూడా క్రికెట్ ఆడే మంది చాలా మంది ఉంటారు. అయితే క్రికెట్ ఆడుతున్న వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు.
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో భాగంగా సోమవారం పెషావర్ జెల్మీ, ఇస్లామాబాద్ యునైటెడ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ ఆటగాడు కోలిన్ మున్రో బాల్ బాయ్ ను ఎత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కొందరు రోజురోజు స్నానం చేస్తేనే వారి శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. అలాంటిది వారు సంవత్సరానికోసారి స్నానం చేస్తారంటా.. అయినా కానీ వారి దగ్గరి నుంచి సుగంధ వాసనే కానీ.. దుర్వాసన రాదంట. ఇంతకీ వారు ఎక్కడ, ఎవరు అనుకుంటున్నారా..! నమీబియాలో హింబా తెగకు చెందిన వారు ఏడాదికి ఒకసారి.. అది కూడా వారి పెళ్లిరోజున మాత్రమే స్నానం చేస్తారు. అయితే.. వారి ఆచారం ప్రకారం నడుచుకుంటూ వెళ్తున్నట్లు ఆ తెగకు చెందిన జనాలు చెబుతున్నారు.
వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పర్వతగిరి మండలం మోత్య తండాలో జరిగింది. విద్యుత్ షాక్ కు గురైన వారిలో మొత్తం నలుగురు యువకులు ఉన్నారు. కాగా.. మొదటగా భూక్యా దేవేందర్ అక్కడికక్కడే మృతి చెందగా.. గాయాలతో ఉన్న సునీల్, రవిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. జేపీ నడ్డా 13 రోజుల క్రితం (ఫిబ్రవరి 20వ) తేదీన గుజరాత్ నుండి రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జేపీ నడ్డా ఇంతకుముందు హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.
ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకురాలు మహువా మోయిత్రాకు మళ్లీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో మొయిత్రాను ఈడీ మార్చి 11న విచారణకు పిలిచింది. ఫిబ్రవరిలో ఫెమా కింద కేంద్ర దర్యాప్తు సంస్థ మొయిత్రాకు సమన్లు జారీ చేసింది. కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టను దిగజార్చేందుకే అదానీ గ్రూప్ కేసులో వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ తరపున మొయిత్రా బహుమతులు, డబ్బు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు లేవనెత్తారని బీజేపీ…
కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో మూడింటిని కాంగ్రెస్ గెలుచుకోగా.. ఒక స్థానంలో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ నేత నసీర్ హుస్సేన్ గెలుపు అనంతరం ఆయన మద్దతుదారులు కర్ణాటక అసెంబ్లీలో సంబరాలు చేసుకుంటూ..‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ అని నినాదాలు చేశారని బీజేపీ ఆరోపించింది. అయితే, కాంగ్రెస్ మాత్రం బీజేపీ ఆరోపణల్ని తోసిపుచ్చింది. ఈ ఆరోపణలపై వాయిస్ నివేదికను ఎఫ్ఎస్ఎల్‌కి పంపగా ముగ్గురు వ్యక్తులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అరెస్టయిన ముగ్గురు ఢిల్లీకి చెందిన ఇల్తాజ్, బెంగళూరులోని ఆర్టీ నగర్‌కు చెందిన మునవర్,…
ప్రధాని మోడీ కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు. రాత్రి 7.50కు బేగంపేట ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా సిటీలో హై అలెర్ట్ ప్రకటించారు. రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. కాగా.. ఈరోజు రాత్రికి ప్రధాని మోడీ రాజ్ భవన్ లో బస చేయనున్నారు. అనంతరం.. రేపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కూడా భద్రత కట్టుదిట్టం చేశారు.
జార్ఖండ్‌లోని దుమ్కాలో స్పానిష్ మహిళా టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం ఉదంతం మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 21 ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఛత్తీస్‌గఢ్‌కు చెందినదిగా గుర్తించారు. పాలములోని విశ్రంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. అయితే.. ఆమే స్టేజ్ ప్రదర్శన ఇవ్వడం కోసమని జార్ఖండ్‌కు వెళ్లింది. కాగా.. బాధితురాలి సహోద్యోగులే అత్యాచారానికి పాల్పడ్డారని ఆ మహిళ ఆరోపించింది. ఈ ఘటన సోమవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో.. ఇప్పటి వరకు ఇద్దరు…