పాతబస్తీ మెట్రో రైలు మార్గానికి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.2 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ మెట్రోకు ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలో మీటర్ల మేర ఐదు స్టేషన్లను నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే సికింద్రాబాద్ నుంచి జేబీఎస్, ఎంజీబీఎస్ మీదుగా పాతబస్తీకి వెళ్లవచ్చు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్…
జంట నగరాలతో పాటు ఉత్తర తెలంగాణలోని ఐదు జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. జాతీయ రహదారి (NH)44పై దశాబ్ధాలుగా ఎదుర్కొంటున్న వాహనదారుల కష్టాలకు చరమగీతం పాడేందుకు రూ.1,580 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5.320 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కడ్లకోయ జంక్షన్ సమీపంలో శనివారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పై తర్వాత మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఈ రకంగా నగరంలో తొలి డబుల్ డెక్కర్ కారిడార్‌కు నేడు నాంది…
దక్షిణ తెలంగాణలో కరువు ఛాయాలకు కేసీఆర్ పాలనే కారణమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. శ్రీశైలం స్వరంగం పనులు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ఈరోజు రైతులు సాగునీరు లేక ఇబ్బంది పడేవారు కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే తెలంగాణ తెచ్చుకున్న ఆనందం కూడా లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగించింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లు కోల్పోయి 473 పరుగులు చేసింది. కాగా.. భారత్ 255 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో కుల్దీప్ యాదవ్ (27), జస్ప్రీత్ బుమ్రా (19) పరుగులతో ఉన్నారు.
ఇందిరా పార్కు వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చరిత్రలో మహిళతో పెట్టుకున్న వారు ఎవరు బాగుపడలేదని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల వాటా మహిళకు రావాలని కవిత కోరారు. గత ప్రభుత్వం అమలు చేసిన రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పారని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వ హయాంలో ఒక…
విశాఖలో ఓ ప్రేమజంట నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టింది. పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్స్ అంటూ నిరుద్యోగులను నమ్మించి వారి దగ్గరి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. నకిలీ పోలీస్ అవతారమెత్తి.. తాము పోలీసులమంటూ నమ్మబలికారు. దీంతో పోలీస్ శాఖలో ఉద్యోగాలు అనగానే.. నిరుద్యోగులు వారికి భారీ ఎత్తున ముట్టజెప్పారు. ఇదే అదునుగా భావించిన నకిలీ పోలీసులు 30 మంది నుంచి రూ.3 కోట్లు వసూలు చేసింది.
మహాశివరాత్రి పర్వదినాన నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లక్ష్మీ కాలువలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు నిజమాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం గన్యా తండాకు చెందిన యువకులు సాయినాథ్, లోకేష్, మున్నాగా గుర్తించారు. వీరి సరదాగా కాలువలోకి దిగడంతో అందులోనే జారిపోయారు. అయితే గల్లంతైన యువకుల కోసం అధికారులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే లక్ష్మి కాలువకు నీటి విడుదల అవుతుండగా.. యువకులను గుర్తించడం కోసం నీటి విడుదలను నిలిపివేసి గజ ఈతగాళ్లతో…
లోక్ సభ ఎన్నికల అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితాపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేసింది. ఈరోజు.. 10 రాష్ట్రాల నుంచి దాదాపు 60 సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది. తెలంగాణలో 9 మందితో మొదటి జాబితా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఉద్యోగులను పట్టించుకోలేదని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా.. ముందుగా ఎంజీఎం మహిళా సిబ్బంది అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు అందరూ ప్రభుత్వం గెలుపుకు కారణం అయినందుకు మీరందరికి చెప్పినట్లుగానే ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా మీరు నర్సింగ్ ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకుని పేషంట్లకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.
ఐపీఎల్ 2024 మార్చి 22న ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికొస్తే, కొత్త ప్లేయర్స్ తో బలంగా ఉంది. ఇప్పటికే ఐడెన్ మార్క్రమ్ ను కెప్టెన్ గా తొలగించి, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ప్యాట్ కమిన్స్ కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. జట్టులోనూ భారీగా మార్పులు చేపట్టింది. మరోవైపు.. ఈరోజు కొత్త జెర్సీని కూడా విడుదల చేసింది.