భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో తొలి రోజు ముగిసింది. ఈ మ్యాచ్ లో తొలిరోజు టీమిండియా ఆట ముగిసే సమయానికి 30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ (52), శుభ్‌మన్ గిల్ (26) పరుగులతో ఉన్నారు. కాగా.. యశస్వి జైస్వాల్ 58 బంతుల్లో 57 పరుగులు చేసి పెవిలియన్‌కు బాటపట్టాడు. షోయబ్ బషీర్ బౌలింగ్ లో ఔటయ్యాడు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 57.4 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. భారత్ స్పిన్ బౌలర్ల దాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కుల్దీప్ యాదవ్, అశ్విన్ చెలరేగడంతో ఇంగ్లండ్ 218 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5, అశ్విన్ 4 పడగొట్టారు. రవీంద్ర జడేజాకే ఒక వికెట్ దక్కింది. ఇక.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు ఎవ్వరూ పెద్దగా రాణించలేకపోయారు. డకెట్ (27), పోప్ (11), రూట్ (26), బెయిర్‌స్టో (29), స్టోక్స్ డకౌట్, ఫోక్స్ (24), హార్ట్లీ (6), షోయబ్ బషీర్ (11), వుడ్ డకౌట్, ఆండర్సన్ డకౌటయ్యారు.
Uttar Pradesh: అత్యాచార బాధితురాలి తండ్రి ఆత్మహత్య.. కేసు విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిడి..
ఇక.. ఈ మ్యాచ్ లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. రజత్ పాటిదార్ స్థానంలో దేవదత్ పడిక్కల్ కు అవకాశం లభించింది. మరో ఆటగాడు ఆకాశ్ దీప్ స్థానంలో బుమ్రా తిరిగి వచ్చాడు. ఇక.. ఇంగ్లండ్ జట్టు ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. ఆలీ రాబిన్సన్ స్థానంలో మార్క్ వుడ్‌కి అవకాశం లభించింది. ఇదిలా ఉంటే.. భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టోకు ఇది 100వ టెస్టు మ్యాచ్ కావడం గమనార్హం.
ఇప్పటికే టీమిండియా 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే సిరీస్ గెలిచిన తర్వాత కూడా ఈ టెస్టులో కూడా గెలవాలని భారత్ చూస్తోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. మరోవైపు భారత్ పర్యటనను విజయంతో ముగించాలని ఇంగ్లండ్ జట్టు భావిస్తోంది.