Rajesh Veeramalla
Author- NTV Telugu-
Kakarla Suresh: కాకర్ల ట్రస్ట్ సేవలు గుర్తించి టీడీపీ అధిష్టానం టికెట్..
పురిటి గడ్డపై మమకారంతో మెట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో.. ప్రజల జీవితాలు మార్చాలన్న ఆలోచనతో ఉదయగిరి నియోజకవర్గంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. గత రెండేళ్లుగా 16 పథకాలను సొంత నిధులతో ప్రజల్లోకి తీసుకువెళ్లి వేలాదిమందికి లబ్ధి చేకూర్చిన ఘనత ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ-జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కు దక్కింది. ట్రస్ట్ సేవలు సూపర్ సక్సెస్ అయ్యాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా వేలాదిమంది రోగులకు ఉచితంగా వారి… -
YSRCP: ఉత్తరాంధ్రపై వైసీపీ స్పెషల్ ఫోకస్..
ఉత్తరాంధ్రపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో.. తాడేపల్లిలో నిర్వహించిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లతో వైసీపీ ముఖ్యుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో అసెంబ్లీ ఎన్నికలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల ప్రచారం, పోల్ మేనేజ్ మెంట్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు. -
A.M. Reddy Autism Centre: తల్లులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించిన ఏ.ఎం. రెడ్డి ఆటిజం సెంటర్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఏ.ఎం. రెడ్డి ఆటిజం సెంటర్ వారు నిర్వహించిన కార్యక్రమంలో ఆటిస్టిక్ చిన్నారుల తల్లులను ప్రశంసించారు. అనంతరం తల్లులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం మార్చి 7న సాయంత్రం హెూటల్ దస్పల్లాలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆటిస్టిక్ పిల్లల తల్లిదండ్రులు వారి కుటుంబాలతో తరలివచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏ.ఎం. రెడ్డి ఆటిజం పెరుగుదల మరియు ఇతర ప్రవర్తనా సవాళ్ల గురించి తల్లితండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు తరచుగా మందుల వాడటం ద్వారా… -
Keshineni Nani: టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తుపై ఎంపీ కేశినేని నాని కౌంటర్..
టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తుపై ఎంపీ కేశినేని నాని కౌంటర్ వేశారు. చంద్రబాబు పచ్చి మోసగాడు, మాట మీద నిలబడే వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని తెలిపారు. 3 రోజుల నుండి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలో పడిగాపులు కాసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. తెలుగు వారి ఆత్మ గౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. -
Pawan Kalyan: ఎంపీగా పోటీ చేయనున్న పవన్ కల్యాణ్.. బీజేపీ పెద్దల మేరకు బరిలోకి
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది. సీట్ల లెక్క తేలింది. జనసేన-బీజేపీకి కలిపి 8 ఎంపీ సీట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఇందులో బీజేపీ 6, జనసేన 2 చోట్ల పోటీ చేయబోతుందనేది సమాచారం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. కాకినాడ నుంచి ఎంపీగా ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయబోతున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత ఈ అంశంపై క్లారిటీ రానుంది. మచిలీపట్నం లోక్సభ స్థానం నుంచి జనసేన తరుఫున బాలశౌరి పేరు… -
Peddireddy Ramachandra Reddy: సింగిల్గా పోటీ చేసి అత్యధిక స్థానాలు సాధిస్తాం..
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రీజనల్ కోఆర్డినేటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నలభై రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసి, అత్యధిక స్థానాలు సాధిస్తామని పేర్కొన్నారు. కులమతాలు, పార్టీలు చూడకుండా సీఎం జగన్ పేదరికాన్ని కొలమానంగా తీసుకుని పథకాలు అమలు చేశారని అన్నారు. -
YSRCP: 11వ జాబితా విడుదల చేసిన వైసీపీ..
త్వరలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ 11వ జాబితాను విడుదల చేసింది. ఇందులో రెండు పార్లమెంట్, ఒక అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ ఇంఛార్జులను ప్రకటించింది. కర్నూలు పార్లమెంట్ ఇంఛార్జుగా బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్ ఇంఛార్జుగా రాపాక వరప్రసాద్, రాజోలు అసెంబ్లీ ఇంఛార్జుగా గొల్లపల్లి సూర్యారావు పేర్లను ప్రకటించింది. -
Sridhar babu: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎప్పుడు అండగా ఉంటుంది..
పెద్దపల్లి జిల్లా మంథనిలో శ్రీ బిక్షేశ్వర దేవాలయంలో శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు మాహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షాలు పడకపోవడం వల్ల ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నారని, రాష్ట్రంలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య రాకూడదని ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. -
Karumuri Nageswara Rao: ఎన్ని పొత్తులు వచ్చినా పటాపంచలవుతాయి..
శివరాత్రి, తన మనవడి పుట్టినరోజు సందర్భంగా ఇంద్రకీలాద్రి అమ్మవారిని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, వైసీపీ ఏలూరు ఎంపీ అభ్యర్ధి సునీల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు వారికి అమ్మవారి వస్త్రం, ప్రసాదం ఇచ్చి ఆశీర్వచనం చేశారు. దర్శనంతరం మంత్రి కారుమూరి.. బయటికొచ్చి ఎన్టీవీతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో జగన్ సింగిల్ గా వస్తారు... పొత్తులు పెట్టుకోరని తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీలో ఉన్న పెద్దల చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తున్నారని విమర్శించారు. -
CM Revanth Reddy: హైదరాబాద్ సిటీలో ప్రతీ గల్లీని అభివృద్ధి చేసే బాధ్యత మాది..
పాతబస్తీ మెట్రో రైలు మార్గానికి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.2 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ మెట్రోకు ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలో మీటర్ల మేర ఐదు స్టేషన్లను నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే సికింద్రాబాద్ నుంచి జేబీఎస్, ఎంజీబీఎస్ మీదుగా పాతబస్తీకి వెళ్లవచ్చు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్…
తాజావార్తలు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!