చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ను రష్యా ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు వ్లాదిమిర్ పుతిన్ సర్కార్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. కాస్పరోవ్ పుతిన్ సర్కార్ పై బహిరంగంగా తీవ్ర విమర్శలు చేశాడు. అందు కారణంగా ఆయన్ను ‘ఉగ్రవాదులు, తీవ్రవాదులు’ జాబితాలో చేర్చినట్లు రష్యా మీడియా తెలిపింది.
Read Also: Vijaysai Reddy: జగన్కు నమ్మకద్రోహం చేసిన వారిని ప్రజలు క్షమించరు…
60 ఏళ్ల గ్యారీ కాస్పరోవ్ చదరంగంలో పలుమార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచాడు. అయితే ఇతను.. చాలా ఏళ్లుగా పుతిన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా.. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను కాస్పరోవ్ తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే తాజాగా రష్యా ఆర్థిక పర్యవేక్షణా సంస్థ( రోస్‌ఫిన్‌మానిటరింగ్ ) విడుదల చేసిన ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. కాగా.. మరే కారణంతో కాస్పరోవ్ ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిందనే విషయాన్ని తెలపలేదు. ముఖ్య విషయమేంటంటే.. ఈ జాబితాలో పేరు ఉన్న వ్యక్తుల ఆర్థిక లావాదేవీలపై తీవ్ర ఆంక్షలు ఉంటాయి.
Read Also: Rakhi Sawant: అనంత్ అంబానీని నా దగ్గరకు పంపండి.. తృప్తి పర్చడమే కాకుండా బరువు తగ్గిస్తాను
ఇదిలా ఉంటే.. గ్యారీ కాస్పరోవ్ రష్యా ప్రభుత్వ అణచివేత విధానాలకు భయపడి 2014లోనే ఆ దేశం నుంచి వెళ్లిపోయారు. ఆయన పదేళ్లుగా అమెరికాలో జీవనం కొనసాగించాడు. 2022లో రష్యా న్యాయశాఖ కాస్పరోవ్ పై విదేశీ ఏజెంట్ అని ముద్ర వేసింది. కాగా, గ్యారీ కాస్పరోవ్‌పై పుతిన్ సర్కార్ తీసుకున్న చర్యలను హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రత్యర్థుల అణచివేతకు ఈ ఆంక్షలను రష్యా ప్రభుత్వం ఆయుధంగా ఉపయోగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.