హైదరాబాద్‌లో నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ముఠా గుట్టురట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.. డిగ్రీ, డిప్లొమా ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ఆరుగురు గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశారు.
తెలంగాణ హైకోర్టులో ఓ సీనియర్ న్యాయవాది గుండెపోటుతో మరణించాడు. మంగళవారం ఓ కేసుకు సంబంధించి తన క్లైయింట్ తరుఫున వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో లాయర్ వేణుగోపాల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడున్న తోటి లాయర్లు, కోర్టు సిబ్బంది హాస్పిటల్‌కు తరలించే లోపే మార్గమధ్యలో న్యాయవాది వేణుగోపాల్ రావు మృతి చెందాడు.
మహబూబాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలకు హామీ ఇచ్చింది.. హామీలను నెరవేర్చడం విఫలమైందని ఆరోపించారు.
మార్చి 2వ తేదీ నుండి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో చేయాల్సిన ఏర్పాట్ల పై డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంజాన్ మాసంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో ఆర్ఎంపీ (RMP), పీఎంపీ (PMP) గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సభకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ కోదండరాం హాజరయ్యారు. రాజశేఖర్ రెడ్డి హయంలో 14 వేల మందికి శిక్షణ ఇచ్చారు.. ఇంకా తమకు సర్టిఫికెట్ ఇవ్వలేదంటూ.. ఇప్పుడు తమపై దాడులు జరుగుతున్నాయని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులుగా ఉన్న తమకు ప్రభుత్వ గుర్తింపు కావాలంటూ ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నారు.
ఎల్ఐసీ డబ్బుల కోసమని ఆశపడి బావనే బామ్మర్ది మర్డర్ చేశాడు. కాగా.. ఈ మర్డర్ కేసును అమీన్‌పూర్ పోలీసులు 24 గంటల్లో చేధించారు. బీమా డబ్బులు కోసమే సొంత బావను బావమరిది హత్య చేసినట్లుగా గుర్తించారు. గోపాల్ నాయక్‌ను అతని బామ్మర్ది నరేష్, మేనమామ దేవి సింగ్‌లు హత్య చేసినట్లుగా పోలీసులు కనుగొన్నారు.
రెండు రోజుల భారతదేశ పర్యటన నిమిత్తం సోమవారం సాయంత్రం ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం విమానాశ్రయానికి వెళ్లి అరుదైన ఆతిథ్యాన్ని అందించారు. ఖతార్ అమీర్‌ను ప్రధాని మోడీ ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం ముందు కరాచీలోని నేషనల్ స్టేడియంలో భారత జెండా కనిపించకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) వివరణ ఇచ్చింది. ఈ టోర్నీలో పాల్గొనే దేశాల జెండాలను స్టేడియం పైకప్పుపై ఎగురవేస్తున్నట్లు చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే..
ఈ మహా కుంభమేళాలో ఎంతో మంది పేదలు.. లక్షాధికారులు అయ్యారు. ఇంకొదరు ఫేమస్ అయ్యారు. ఎవరో తెలియని వ్యక్తులను మహా కుంభమేళా వారి జీవితాలనే మార్చేసింది. కుంభమేళా వారిని సోషల్ మీడియా ద్వారా స్టార్లను చేసింది. అందులో హర్ష రిచారియా, ఐఐటీ బాబా, మోనాలిసా వంటి వారు మనకు తెలిసిందే.. అయితే వీరు కాకుండా మరొకరు ఉన్నారు. అతనే తన ప్రియురాలి కోసం వేప పుల్లలు అమ్మిన ఆకాష్ యాదవ్. యూపీలోని జౌన్‌పూర్ ప్రాంతానికి చెందిన ఆకాష్ యాదవ్ మహా కుంభంలో వేప పుల్లలు…
భారతదేశంలో ప్రసిద్ధ SUVల తయారీదారు అయిన మహీంద్రా.. మహీంద్రా BE6 అనే కొత్త ఎలక్ట్రిక్ SUVని ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ SUV దాని టాప్ వేరియంట్ ప్యాక్ 3లో వివిధ రకాల ఫీచర్లతో వస్తుంది. ఈ కారును కొనుగోలు చేయడం మంచిదేనా.. కాదా అనే వివరాలు తెలుసుకుందాం. మహీంద్రా ఇటీవలే ఎలక్ట్రిక్ SUVగా BE6 ను విడుదల చేసింది.