హైదరాబాద్‌లో నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ముఠా గుట్టురట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.. డిగ్రీ, డిప్లొమా ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ఆరుగురు గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశారు. వివిధ యూనివర్సిటీల పేర్లతో ఈ గ్యాంగ్ సర్టిఫికెట్స్ తయారు చేస్తుంది. తెలంగాణ, ఆంధ్రా, అన్న యూనివర్సిటీ చెన్నై పేరు మీద నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేశారు. ఈ ఫేక్ సర్టిఫికెట్స్‌తో విదేశాలకు సైతం కొందరు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కాగా.. ఫిల్మ్‌నగర్ పీఎస్ పరిధిలో ఫేక్ సరిఫికెట్స్ గ్యాంగ్‌ను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Big twist in Vallabhaneni Vamsi case: వల్లభనేని వంశీ కేసులో మరో కొత్త ట్విస్ట్..
ఈ సందర్భంగా సికింద్రాబాద్ నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ డీసీపీ సుదీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఫేక్ సర్టిఫికెట్ ముఠాలో వజహత్ అలీ నకిలీ సర్టిఫికెట్‌తో దొరికాడని అన్నారు. ఈ క్రమంలో విచారణ జరిపామని.. నకిలీ సర్టిఫికెట్స్ తయారీలో రాజిఉల్లా ఖాన్, హాబీబ్ ఇద్దరు ఉన్నట్లు వజహత్ అలీ మొదట చెప్పాడు.. ఇంకొందరు కూడా ఉన్నారని తమకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని అన్నారు. ఈరోజు పరేడ్ గ్రౌండ్ దగ్గరికి గ్యాంగ్ సభ్యులు అందరూ వచ్చినట్లు సమాచారం వచ్చింది.. దీంతో.. అక్కడికి వెళ్లి వారిని పట్టుకున్నామని తెలిపారు. అంతేకాకుండా.. వారి వద్ద ఉన్న ఫేక్ సర్టిఫికెట్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
Read Also: TG High Court: విషాదం.. కేసు వాదిస్తూ గుండెపోటుతో కుప్పకూలిన న్యాయవాది
వజహత్ అలీ నిజామాబాద్‌కు చెందిన వ్యక్తి.. హాబీబ్ ఫ్లై అబ్రాడ్ కన్సల్టెన్సీ నడపిస్తున్నాడని డీసీపీ సుదీంద్ర తెలిపారు. గతంలో హాబీబ్ నాలుగు కేసుల్లో ఉన్నాడు.. హాబీబ్ పై నాలుగు నకిలీ సర్టిఫికెట్స్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఏజెంట్స్, సబ్ ఏజెంట్స్ ద్వారా ఈ ఫేక్ సర్టిఫికెట్స్ దందా నిర్వహిస్తున్నారని డీసీపీ చెప్పారు. జాబ్ లేకుండా ఉన్న వారు.. మ్యారేజ్ కానీ వారు టార్గెట్‌గా ఈ సర్టిఫికెట్స్ దందా చేస్తున్నారన్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ఆరుగురు గ్యాంగ్ సభ్యులు అరెస్ట్ చేసామని తెలిపారు. లక్షన్నర నుండి ఎక్కువ కూడా ఒక్కో సర్టిఫికెట్‌కు తీసుకుంటారని చెప్పారు. తమకు వారి వద్ద నుంచి 114 సర్టిఫికెట్స్ దొరికాయని అన్నారు. సునీల్ కపూర్, రాహుల్ తివారీ యూపీ నుండి ఈ సర్టిఫికెట్స్ తయారు చేసి పంపిస్తున్నారని వెల్లడించారు. కాగా.. ముఠా నుంచి 4 లాప్‌టాప్స్, ప్రింటర్, రాయల్ ఎంఫైల్డ్, విసిటింగ్ కార్డ్స్, మొబైల్ ఫోన్స్ సీజ్ చేసామని డీసీపీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ పేర్కొన్నారు.