ధోని తన రిటైర్మెంట్ పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టాడు. "నేను నా క్రికెట్ కెరీర్‌లోని చివరి కొన్ని సంవత్సరాలను ఆస్వాదించాలనుకుంటున్నాను," అని ధోని తెలిపాడు. ధోని.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తప్ప మరే ప్రొఫెషనల్ క్రికెట్ ఆడడు. అయితే.. కొన్నేళ్లుగా అతని బ్యాటింగ్ ప్రదర్శనలో మార్పు వచ్చింది. కేవలం అతని అభిమానుల కోసం క్రికెట్ ఆడుతున్నట్లుగా అనిపిస్తోంది. గత సీజన్‌లో ధోని బ్యాటింగ్ లైనప్‌లో 8వ స్థానంలో దిగాడు. గత సీజన్‌లో ధోని మొత్తం 73 బంతుల్లో 161 పరుగులు చేశాడు.
భారత జట్టు కెప్టెన్, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఒక గొప్ప ఘనత సాధించాడు. "హిట్‌మ్యాన్" గా ప్రసిద్ధి చెందిన రోహిత్ శర్మ, వన్డే క్రికెట్‌లో 11,000 పరుగులు చేసిన రెండవ అత్యంత వేగవంతమైన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
హ్యుందాయ్ మోటార్స్ 2025 ఫిబ్రవరిలో భారత మార్కెట్లో మూడు ప్రధాన కార్ల ధరలను పెంచింది. వీటిలో హ్యుందాయ్ వెర్నా, హ్యుందాయ్ గ్రాండ్ నియోస్ i10, హ్యుందాయ్ వెన్యూ N-లైన్ కార్ల ధరలు పెరిగాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లో 228 పరుగులు చేసింది. భారత్ ముందు 229 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది.
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి వరల్డ్ రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను మూడో వికెట్ సాధించిన వెంటనే అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్‌గా ఒక కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డుతో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్‌ను అధిగమించాడు.
భారతీయ SUV మార్కెట్‌లో ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. ఈ వాహన విభాగాన్ని దృష్టిలో ఉంచుకొని, వాహన తయారీదారులు కొత్త మోడల్స్‌ను పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో, టాటా మోటార్స్ త్వరలో టాటా సియెర్రా SUVని భారత మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది.
ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వేసిన ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే.. అదే ఓవర్‌లో మరో వికెట్ పడాల్సింది. మరో వికెట్ పడి ఉంటే.. ఈరోజు చరిత్రలో మిగిలిపోయేది. వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించి, భారత ఆటగాళ్ల ప్రత్యేకమైన జట్టులో చేరేవాడు. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పిదం కారణంగా అక్షర్ పటేల్ హ్యాట్రిక్ సాధించలేకపోయాడు.
సొంతగడ్డపై జరుగుతున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌కు మంచి ఆరంభం లభించలేదు. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లోనే పాకిస్తాన్ జట్టు 60 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవి చూసింది. మొదటి మ్యాచ్‌లోనే ఓడిపోయిన పాకిస్తాన్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. బ్యాటర్ ఫఖర్ జమాన్ గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు.
భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన భాగస్వామి ధనశ్రీ వర్మతో విడాకుల పుకార్ల మధ్య.. మరో ఫోస్ట్ చేశాడు. గురువారం (ఫిబ్రవరి 20) ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సీక్రెట్ పోస్ట్‌ను పంచుకున్నాడు. ఈ పోస్ట్‌లో చాహల్ తనకు వచ్చిన క్లిష్ట పరిస్థితుల నుండి రక్షించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలిపారు.
కరాచీలో బాబర్ ఆజం చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 అర్ధ సెంచరీలు సాధించిన రెండవ పాకిస్తానీ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. దీంతో.. బాబర్ తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు. 2015 మే 31న లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బాబర్.. ఇప్పటి వరకు 59 టెస్టుల్లో 29 హాఫ్ సెంచరీలు, 127 వన్డేల్లో 35 హాఫ్ సెంచరీలు, 128 టీ20ల్లో 36 హాఫ్ సెంచరీలు సాధించాడు.